సస్యరక్షణతో అధిక దిగుబడులు
1 min readపల్లెవెలుగు , వెబ్ చాగలమర్రి : గ్రామాలలో రైతులు సస్యరక్షణ మెళుకవలు పాటిస్తే అధిక దిగుబడులు సాధించ వచ్చునని మహనంది ఉధ్యాన పరిశోధన కేంద్ర ప్రధాన శాస్త్రవేత్త సుబ్రమాణ్యం తెలియజేసారు.శుక్రవారం మండలంలోని డి.కొత్తపల్లె లో ఉల్లి పంట సాగుపై అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సదస్సులో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఉల్లిలో ట్విస్టర్ బ్లైట్ అను కొత్త రకం తెగులును గుర్తించడం జరిగిందన్నారు. ఈ తెగులు యొక్క లక్షణాలను శాస్త్రవేత్త గారు రైతులకు విపులంగా వివరించి నివారణ పద్దతులను సూచించారు.ఈ సదస్సులో గ్రామ సర్పంచ్ ఆర్ బాల ఈశ్వర్ రెడ్డి, నంద్యాల ఉద్యాన అధికారి శ్రీధర్, ఆళ్లగడ్డ ఉద్యాన అధికారి నరేష్ కుమార్ రెడ్డి, ఏవో రంగ నేతాజీ, గ్రామ రైతులు ఆర్ బి కే సిబ్బంది ప్రసాద్ పాల్గొనడం జరిగింది.