122 ఏళ్ల తర్వాత అత్యధిక ఉష్ణోగ్రత..ఎప్పుడంటే ?
1 min read
పల్లెవెలుగువెబ్ : ఈ సంవత్సరం మార్చిలో 122 ఏళ్ల తర్వాత అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. గత నెలలో దేశంలోని చాలా భాగంలో తీవ్ర వేడిగాలులు వీచాయని పేర్కొంది. ఉత్తర, దక్షిణ భారతదేశంలో చురుకైన పశ్చిమ పవనాలు లేకపోవడం, అల్ప వర్షపాతమే ఇందుకు కారణమని విశ్లేషించింది. ‘దేశం మొత్తమ్మీద చూస్తే, 33.10 డిగ్రీల సరాసరి గరిష్ట ఉష్ణోగ్రత మార్చి 2022లో నమోదైంది. గత 122 ఏళ్లలో ఇదే అత్యధికం’ అని ఐఎండీ పేర్కొంది. దేశంలో 2010 మార్చిలో 33.09 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రతగా నమోదైంది.