PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

హిందీ భాష దినోత్సవం… విద్యార్థులకు బహుమతులు

1 min read

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు:  సెప్టెంబర్ 14వ తేదీ హిందీ భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని మండలంలోని ఓబులంపల్లె పాఠశాలలో గురువారం విద్యార్థులకు హిందీ పాటల , డ్రాయింగ్ కాంపిటేషన్ నిర్వహించి విద్యార్థులకు బహుమతులు అందజేసినట్లు ప్రధానోపాధ్యాయులు మొగల్ కాజా హుస్సేన్ తెలిపారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందీ రాజా భాష, హిందీని నేర్చుకోవడం వలన దేశంలో ఏ మారుమూల ప్రాంతాల కైనా వెళ్ళవచ్చని, హిందీ చాలా సులభమై భాష అని , హిందీ భాష ఎంతోమందికి జీవనోపాధిని కలిగించినటువంటి భాషని ఆయన కొనియాడారు, తర్వాత విద్యార్థిని విద్యార్థులకు హిందీ పాటల డ్రాయింగ్ కాంపిటీషన్లో విజేతలైన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు ఖదీర్ భాష, ఎల్లేశ్వర రావు, శ్రీనివాసులు, సుజాత, శ్రీనివాసమూర్తి, పాఠశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొనడం జరిగింది.

About Author