హిందూకు.. ఇండియాకు సంబంధం లేదు !
1 min readపల్లెవెలుగువెబ్ : కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు లక్ష్మణ్ రావు జర్కిహోళి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘హిందూ’ అనే పదం పర్షియాకు చెందినదని, ఈ పదంతో భారతదేశానికి ఎలాంటి సంబంధం లేదని అన్నారు. ‘హిందూ’ అనే పదానికి పర్షియన్ భాషలో ‘భయానకం’ అని అర్థమని వివరించారు. ‘హిందూ’ అనే పదం ఎక్కడ్నించి వచ్చింది? దీనికి భారతదేశంతో ఏమిటి సంబంధం? వికీపీడియాలో కానీ, వాట్సాప్ లో కానీ వెతుక్కోండి… ‘హిందూ’ అనే పదానికి అర్థం ఏమిటో తెలుస్తుంది. ఈ పదానికి ఎందుకింత గొప్పదనాన్ని ఆపాదిస్తున్నారు? అని లక్ష్మణ్ రావు జర్కిహోళి ప్రశ్నించారు.