NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

హిందూ ద్రోహి… టిప్పుసుల్తాన్​..

1 min read

– వీహెచ్​పీ రాష్ట్ర కార్యధ్యక్షులు నంది రెడ్డి సాయి రెడ్డి

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు : హిందువులను ఊచకోత కోసి.. లక్షలాది మందిని మతమార్పిడి చేసిన విదేశీ దురాక్రమణ దారుడు టిప్పుసుల్తాన్ అని వీహెచ్​పీ రాష్ట్ర కార్యధ్యక్షులు నంది రెడ్డి సాయి రెడ్డి ఆరోపించారు. ఆదివారం కర్నూలు వినాయక ఘాట్​ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశలో ఆయన మాట్లాడారు. కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో టిప్పు సుల్తాన్​ విగ్రహం ఏర్పాటు చేయాలని భూమిపూజ చేశారని, ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్​ రెడ్డి … టిప్పు సుల్తాన్​ దేశభక్తుడు.. స్వాతంత్ర్య సమరయోధుడు అనడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వేల హిందూ దేవాలయాలను కూల్చిన టిప్పు సుల్తాన్​.. దేశ భక్తుడు ఎలా అవుతాడని ఘాటుగా ప్రశ్నించారు. ప్రొద్దుటూరులో టిప్పుసుల్తాన్ విగ్రహం ఏర్పాటు చేస్తే విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ అడ్డుకుంటుందని హెచ్చరించారు. మైనారిటీ ఓటుబ్యాంకు ముసుగులో గుడ్డిగా నమ్ముతున్న ప్రొద్దుటూరు శాసనసభ్యులు వాస్తవ చరిత్ర తెలుసుకొని హిందూ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ సభ్యులు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకుని హిందూ మనోభావాలను గౌరవించేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా నందిరెడ్డి సాయి రెడ్డి కోరారు. సమావేశంలో వీహెచ్​పీ రాష్ట్ర సహ కార్యదర్శి ఎస్. ప్రానేశ్, భజరంగ్దళ్ రాష్ట్ర కన్వీనర్ టి ప్రతాపరెడ్డి, కర్నూలు నగర అధ్యక్షులు డాక్టర్ లక్కిరెడ్డి అమరసింహా రెడ్డి, కార్యదర్శులు గోరంట్ల రమణ, విశ్వహిందూ పరిషత్ కర్నూల్ విభాగ్ కార్యదర్శి సుబ్రహ్మణ్యం, జిల్లా కార్యదర్శి విజయుడు, నగర కార్యదర్శి భాను ప్రకాష్, బజరంగ్ దళ్ విభాగ్ కన్వీనర్ నీలి నరసింహ, నగర కన్వీనర్ సి. ప్రసన్నకుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


About Author