హిందువుల మనోభావాలను కించ పరిస్తే ..సహించేది లేదు..
1 min readవీహెచ్పీ జిల్లా అధ్యక్షులు గోరంట్ల రమణ
పల్లెవెలుగు వెబ్: రాజ్యాంగ పితామహుడైన అంబేద్కర్ మహానీయుడి పేరును వాడుకుంటూ భారత రాజ్యాంగం ప్రసాదించిన మత స్వేచ్ఛను కాలరాస్తూ…వాక్ స్వాతంత్ర్యాన్ని దుర్వినియోగం చేస్తూ “నాస్తిక సంఘం” పేరుతో పరమత సహనం కలిగిన హిందువులు ఎంతో భక్తితో నమ్మి పూజించే దేవీదేవతలను నీచంగా నోటికి వచ్చినట్టు మాట్లాడే హక్కు బైరి నరేష్, రాజేష్ తదితరులకు ఎవ్వరిచ్చారనీ… దేశంలో మెజారిటీ హిందువుల పై ఒక మతం వాడేమో 15 ని. సమయం ఇస్తే హిందువులందరినీ చంపేస్తానంటాడు.. ఇంకో మతం వాడేమో భరతమాత కు ఎందరు భర్తలు అని అడుగుతాడు…ఇప్పుడు వీడేమో ఎంతో భక్తి ప్రపత్తులతో 40 రోజులు వైరాగ్యాభావనతో, “మాల” వేసి కొలిచే శబరిగిరీషుడైన అయ్యప్ప స్వామి జన్మ గురించి ఇంత నీచంగా అన్ని హద్దులూ దాటి మాట్లాడితే కూడా హిందువులు ఓట్లు వేయకపోతే గెలువ లేని వివిధ పార్టీల నాయకులు ఒక్కమాట కూడా అనని,కనీసం ఖండించని పార్టీల నాయకులను ఏమనాలి… హిందూ రాజకీయ నాయకులే ఇతర వర్గాల సమావేశాలకు వెళ్లినపుడు హిందూ ధర్మాన్ని, ఆచారాలనూ తమ ఓటు బ్యాంకు రాజకీయాలలో భాగంగా తక్కువ చేసి మాట్లాడటం వల్ల బైరి నరేష్, రాజేష్ లాంటి నీచులకు అవకాశం ఇచ్చినట్లయ్యింది. లౌకిక రాజ్యం లో ఇతర మతస్తులకు ఏదైనా అన్యాయం జరిగితే ఒంటికాలిపై లేచే సినిమా,రాజకీయ,మేధావి వర్గాల వారిని సూటిగా, నిర్మొహమాటంగా ప్రశ్నిస్తున్నా… భైరి నరేష్ చేసిన పని మీకు తప్పులా కనిపించడం లేదా….??? ఎన్నో ఏళ్ళుగా హిందూ నాయకులే హిందువులను అణగద్రొక్కుతుంటే ఇంకెన్నాళ్ళు భరించాలి…ఇక భరించేది లేదు…స్వతహాగా హిందూ సమాజం ఎప్పుడూ ఇతర మతస్తులను సహృదయంతో నే అక్కున చేర్చుకున్నది దాన్ని అలుసుగా తీసుకుని కొందరు మతోన్మాదులు హిందూ సమాజాన్ని పదే పదే కించ పరిస్తే ఇకపై సహించేది లేదనీ… తప్పుచేసిన రాజేష్ తదితర వ్యక్తులకు శిక్షపడేవరకూ చట్టపరిధిలో,రాజ్యాంగం బద్ధంగా విశ్వహిందూ పరిషత్ పోరాటం చేస్తుందని విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు గోరంట్ల రమణ హెచ్చరించారు.