ఆయనది లక్షల కోట్ల ఆస్తి.. ఒక్కపూటలో కరిగిపోయింది !
1 min readల్లెవెలుగు వెబ్ : జీవితాంతం కష్టపడి సంపాదించిన డబ్బు ఒక్కపూటలో కరిగిపోతే ఎలా ఉంటుంది?. నిజంగా అలాంటి పరిస్థితే చైనాకు చెందిన ఓ వ్యాపారికి ఎదురైంది. చైనా రియల్ ఎస్టేట్ మార్కెట్ లో వచ్చిన సంక్షోభం ఒక్క పూటలో ఆయన జీవితాన్ని తలకిందులు చేసింది. ఝాంగ్ యువాన్లిక్. సినిక్ హోల్డింగ్స్ గ్రూప్ చైర్మన్. హాంకాంగ్ బేస్డ్ రియల్ ఎస్టేట్ రారాజు. సొంతంగా కష్టపడి పైకొచ్చాడు. కానీ చైనా మార్కెట్లోని సంక్షోభం అతడిని సంక్షోభంలోకి నెట్టేసింది. 1.3 మిలియన్ డాలర్ల సంపద ఒక్కపూటలో 250 బిలియన్ డాలర్లకు చేరింది. 87 శాతం పైగా ఆయన సంపద ఒక్కపూటలో ఆవిరైంది. ఇలాంటి ఘటనలు చాలా అరుదు. చైనా ప్రభుత్వం తీసుకొచ్చిన కామన్ ప్రాస్పరిటీ విధానం వల్ల ఆ దేశ ధనికులు వేలకోట్ల సంపదను కోల్పోతున్నారు. పూర్తీగా కార్పొరేట్లను తమ చెప్పుచేతుల్లో తీసుకొచ్చే ప్రయత్నంలో డ్రాగన్ ప్రభుత్వం విజయవంతం అవుతోందని చెప్పవచ్చు.