టిప్పు సుల్తాన్ చరిత్ర.. కొన్ని అంశాలు తొలగింపు !
1 min readపల్లెవెలుగువెబ్ : కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పాఠ్యపుస్తకాల్లో టిప్పు సుల్తాన్ చరిత్రను పొగుడుతూ ఉన్న అనవసర అంశాల్ని తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. టిప్పు సుల్తాన్ చరిత్రపై పాఠ్య పుస్తకాల్లో పొందుపర్చిన అంశాలపై సమీక్ష జరిపేందుకు కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం స్కూల్ టెక్స్ట్ బుక్ రివ్యూ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ అంశంపై పరిశీలించిన కమిటీ… టిప్పు సుల్తాన్ చరిత్రను కీర్తిస్తూ ఉన్న అంశాల్ని తొలగించాలని సూచించింది. దీనిపై స్పందించిన ప్రభుత్వం.. పాఠ్య పుస్తకాల్లో టిప్పు సుల్తాన్ చరిత్ర అలాగే ఉంటుందని, అయితే, అతిగా పొగుడుతూ ఉన్న అంశాల్ని మాత్రమే తొలగిస్తామని చెప్పింది. దీంతో ప్రభుత్వ నిర్ణయంపై కాంగ్రెస్ విమర్శలు చేస్తోంది. టిప్పు సుల్తాన్ మైనారిటీ వర్గానికి చెందినవాడు కాబట్టే, బీజేపీ ప్రభుత్వం ఇలా చేస్తోందని విమర్శించింది.