PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

హొలగుంద మండల మదాసి…మదారి కురువ నూతన కమిటీ ఎన్నిక

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద: ఈరోజు ఆలూరు నియోజకవర్గం పరిధిలో ఉన్న హొలగుంద మండల నూతన కమిటీని ఆంధ్రప్రదేశ్ మదసి&మదారి కురువ (కురువ) రిజర్వేషన్ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పెద్దయ్య ఆదేశాల మేరకు  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి K. రామ మోహన్  ఆధ్వర్యంలో ఆలూరు తాలూకా అధ్యక్షులు తాలూకా ప్రధాన కార్యదర్శి పెద్దహ్యట మల్లయ్య వారి కమిటీ సభ్యుల పర్యవేక్షణలో నూతన మండల కమిటీని ఎన్నుకోవడం జరిగింది. గౌరవ అధ్యక్షుడిగా కాలిక ప్రసాద్, గౌరవ సలహాదారుడిగా కోగిలతోట శేషప్ప, డిసి బొజ్జన్న, డాక్టర్ రామాంజనేయులు, మండల అధ్యక్షుడిగా పంపన్న, మండల ఉపాధ్యక్షుడిగా రవి స్వామి, బసవరాజు, మండల ప్రధాన కార్యదర్శి ఎల్లార్తి లక్ష్మన్న, నిర్వాహక అధ్యక్షుడు వంధవగిలి గర్జాప్ప, కోశాధికారి మైలారి, సహాయ కార్యదర్శి గాదిలింగ, కార్యవర్గ సభ్యులుగా నరెగలప్ప, శివకుమార్,సిద్ధప్ప,రామకోటి, లింగంపల్లి భీమ,గొరవ వీరేష్ వీరిని మండల కమిటీ సభ్యులిగా అందరి ఆమోదయోగ్యంతో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ మోహన్, ఆలూరు తాలూకా ప్రధాన కార్యదర్శి  మల్లయ్య మాట్లాడుతూ ఈరోజు ఆలూరు నియోజకవర్గంలో దాదాపుగా మదాసి కురువలు 62 వేల ఓటరు ఉన్నారు ఇంత పెద్ద సామాజిక వర్గం ఉన్న ఈ నియోజకవర్గంలో మాకు ప్రభుత్వాలు కానీ పార్టీలు కానీ ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వకుండా మమ్మల్ని వెనక్కూ నెట్టు వేయడం జరిగింది ప్రధానంగా మా యొక్క డిమాండ్ మా కులం పూర్తి పేరుతో మదాసి మదారి కురువ ఎస్సి సర్టిఫికెట్స్ జారీ చేయాలని,అలాగే మా బీరప్ప స్వామి పూజారులకు గౌరవ వేతనం ఇవ్వాలని,గొరవయ్య లకు కళాకారులకిoద గుర్తించి పింఛన్ మంజూరు చేయాలని, అన్ని పార్టీలు జిల్లాలో మాకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని,గొర్రెల కాపరులకు జీవిత ప్రమాద బీమా ప్రభుత్వమే కల్పించాలని, ఆలూరు నియోజకవర్గం కేంద్రం లో మాకు ఒక ఎకరం ప్రభుత్వ భూమిని కనకదాసు భవనానికి కేటాయించాలని డిమాండ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో అలురూ తాలూకా గౌరవాధ్యక్షుడు రంగన్న.అలూరు మండల అధ్యక్షుడు.శ్రీనివాసులు, వందవాగిలి సర్పంచ్ భర్త శేషప్ప,ఎండిహళ్లి సర్పంచ్ సుధాకర్,హోలగుందా గదిలింగప్ప,మల్లికార్జున,చిన్న,చగప్పా,కెంప గదిలింగా, రాయన్న సంగం ఆలూరు తాలు ప్రధాన కార్యదర్శి మంజునాథ్,కనక శ్రీ యూత్ నాయకులు ఎస్కే గిరి మరిమల్ల రమేష్.చిన్నహ్యట వార్డ్ మెంబర్ మంజు, bg హల్లి బీమా,తిప్పేశ, ఏలార్తీ రము పంచార్ సేసి,ఉంచకై సేశి,గధిలింగ,లింగంపల్లి ముక్కాన్న, సులువాయి మల్లి, రమేశ్,మునుమంగుంది బీమా,గాధిలింగ, ఎండి హళ్లి పులికొండ, గాది, లింగంపల్లి ముక్కన్న,సమతిగేరి పరశురామ,అలాగే హొలగుంద మండల పరిధిలోని అన్ని గ్రామాల మదాసి&మదారి కురువలు కనక శ్రీ యూత్ నాయకులు సీనియర్ నాయకులు సభ్యులు తదితరులు భారీ ఎత్తున పాల్గొన్నారు.

ఏపీ, రిజర్వేషన్​, జీవిత ప్రమాద బీమా,

About Author