బీఎస్పీ నేత ఇంట్లో ఘనంగా హోలీ
1 min read
వేడుకల్లో కుమారుడు లక్ష్మీ పవన్ తో కలిసి పాల్గొన్న బహుజన సమాజ్ పార్టీ జిల్లా ఇన్చార్జి లక్ష్మీనారాయణ
అనంతపురం, న్యూస్ నేడు: అనంతపురం నగర ప్రముఖుడు, వ్యాపారి, సీనియర్ జర్నలిస్ట్, బహుజన సమాజ్ పార్టీ అనంతపురం జిల్లా ఇంచార్జ్, కంటెస్టింగ్ ఎమ్మెల్సీ అభ్యర్థి, యువ రాజకీయ నాయకుడు కొత్తూరు లక్ష్మీనారాయణ ఇంట్లో శుక్రవారం హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ కుమారుడు లక్ష్మీ పవన్ మిత్రులకు రంగులు పూశాడు. వాటర్ గన్ తో రంగు నీళ్లను మిత్రులపై చెల్లాడు. లక్ష్మీ పవన్ స్నేహితులతో కలిసి వీధిలో తిరుగుతూ మిత్రులందరికీ రంగులు పూసి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. చిన్నారుల కేరింతలతో బీఎస్పీ జిల్లా ఇన్చార్జ్ లక్ష్మీనారాయణ ఆనందంగా గడిపారు.