హోలీ.. చైనాకు రూ. 10 వేల కోట్ల నష్టం !
1 min readపల్లెవెలుగువెబ్ : హోలీ సందర్భంగా దేశంలో సుమారు రూ. 20వేల కోట్ల వ్యాపారం జరిగిందని వ్యాపారవర్గాలు తెలిపాయి. ఈ ఏడాది దేశీయ మార్కెట్‌లో చైనా వస్తువుల అమ్మకాలు జరగలేదని స్పష్టం చేసింది. గతంలో దేశీయ మార్కెట్‌లో చైనా ఉత్పత్తుల హవా ఉండేదని, హోలీ వేడుకల సందర్భంగా రూ.10వేల కోట్ల వ్యాపారం జరిగేదని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. కానీ ఈ ఏడాది భారత్ మార్కెట్‌లో చైనా ఉత్పుత్తులు అమ్మకాలు జరగలేదని సీఏఐటీ ప్రతినిధులు వెల్లడించారు. ఇక హోలీకి ప్రధానంగా రంగులు, బొమ్మలు, బెలూన్లు, హెర్బల్ కలర్స్,గులాల్, వాటర్ గన్, బెలూన్లు, చందన్, డ్రెస్ మెటీరియల్ వంటి దేశీయ వస్తువులు భారీ అమ్మకాలను నమోదు చేసుకున్నాయని సీఏఐటీ తెలిపింది.