NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సెక్రట‌రీల‌కు సెలవులిచ్చేది స‌ర్పంచే..!

1 min read

అమ‌రావ‌తి: గ్రామ పంచాయితీల్లో స‌ర్పంచ్ అధికారాల మీద రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఆయా గ్రామ పంచాయితీల్లో.. పంచాయితీ కార్యద‌ర్శికి సెల‌వు ఇచ్చే అధికారం స‌ర్పంచ్ ల‌కే ఉంటుంద‌ని తేల్చిచెప్పింది. గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 5 పంచాయితీ కార్యద‌ర్శిల వ‌ర‌కు సాధార‌ణ సెల‌వులు పంచాయితీ స‌ర్పంచ్ ఇస్తార‌ని రాష్ట్ర పంచాయ‌తీరాజ్ శాఖ ఉత్తర్వులిచ్చింది. అలాగే పంచాయితీల్లోని డిజిటల్ అసిస్టెంట్ ల‌కు సెల‌వులు.. పంచాయ‌తీ వీఆర్వో ద్వార మండ‌ల అధికారి మంజూరు చేస్తార‌ని పంచాయితీరాజ్ శాఖ స్పష్టం చేసింది. పంచాయితీ సెక్రెట‌రీలు, డిజిట‌ల్ అసిస్టెంట్ ల‌కు ప్రత్యేక సెల‌వులు, మ‌హిళా ఉద్యోగుల‌కు మెట‌ర్నిటీ సెల‌వులు ఎంపీడీవో మంజూరు చేస్తార‌ని పంచాయితీ రాజ్ తెలిపింది.

About Author