PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బ్యాంకుల‌కు సెల‌వులు.. ఎప్పుడో తెలుసుకోండి..

1 min read

పల్లెవెలుగు వెబ్​: బ్యాంకుల‌కు వ‌రుస సెల‌వులు రాబోతున్నాయి. ఈనెల 27 నుంచి ఏప్రిల్ 5 మ‌ధ్యలో కేవ‌లం నాలుగు రోజులే బ్యాంకు కార్యక‌లాపాలు జ‌ర‌గ‌నున్నాయి. మార్చి 30,31..ఏప్రిల్ 3 మాత్రమే బ్యాంకులు ప‌నిచేయ‌నున్నాయి. ఏప్రిల్ 1న ప‌ని దిన‌మే అయిన‌ప్పటికి.. కొత్త ఆర్థిక సంవ‌త్సరం ప్రారంభం కావ‌డంతో బ్యాంకుల కార్యక‌లాపాలు జ‌ర‌గ‌వు. నాలుగో శ‌నివారం, రెండు ఆదివారాలు, హోలీ, జ‌గ‌జ్జీవ‌న్ రామ్ జ‌యంతి, గుడ్ ఫ్రైడే నేప‌థ్యంలో బ్యాంకుల‌కు 6 రోజుల సెల‌వులు రాబోతున్నాయి. ఈ నేప‌థ్యంలో వినియోగ‌దారులు త‌మ ప‌నులు ముందుగానే చక్కబెట్టుకోవాల‌ని బ్యాంకు అధికారులు సూచిస్తున్నారు. ఏటీఎమ్ లు య‌థావిధిగా ప‌నిచేస్తాయ‌ని.. సెల‌వులున్నప్పటికి ఏటీఎమ్ ల‌లో ఎప్పటిక‌ప్పుడు క్యాష్ ఉంచుతార‌ని.. ఈ సెల‌వుల కార‌ణంగా ప్రజ‌లు ఎలాంటి ఇబ్బందుల‌కు గురికాకుండా ఏర్పాట్లు చేస్తున్నట్టు బ్యాంకు అధికారులు తెలిపారు.

About Author