ఏపీలో సెలవులు: ఎందుకో తెలుసుకోండి..!
1 min readపల్లె వెలుగు వెబ్: ఏపీ ప్రభుత్వం రెండు రోజులు సెలవు ప్రకటించింది. ఈమేరకు సీఎస్ ఆదిత్యానాథ్ దాస్ ఉత్తర్వులు వెలువరించారు. ఈ నెల 7,8న సెలవు దినాలు. పరిషత్ ఎన్నికల నేపథ్యంలో సెలవులు ప్రకటించారు. 7వ తేదిన పోలింగ్ ఏర్పాట్ల కోసం, 8వ తేదిన పోలింగ్ కోసం సెలవులు ప్రకటించారు. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ పాఠశాలలు, సంస్థలకు సెలవులు ఇచ్చారు. దుకాణాలు, వాణిజ్య సముదాయాలకు కూడ సెలవులు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో రెండు రోజుల ముందుగానే మద్యం దుకాణాలు మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. 8వ తేది ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 5గంటలకు ముగుస్తుంది. 10వ తేదిన ఓట్ల లెక్కింపు జరుగుతుంది.