PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నేటి నుండి మంగళవారం వరకు పవిత్రోత్సవాలు..

1 min read

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా :  స్వయంభూః శ్రీ మద్ది ఆంజనేయస్వామివారి దేవస్థానం,గురవాయిగూడెం గ్రామము, జంగారెడ్డిగూడెం మండలం,పవిత్రోత్సవముల ఆహ్వానముఏలూరు జిల్లా, జంగారెడ్డిగూడెం మండలం, గురవాయిగూడెం గ్రామము లో వేంచేసియున్న శ్రీమద్ది ఆంజనేయస్వామివారి దేవస్థానములో స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ శోభకృత్ నామ సంవత్సర భాద్రపద శుద్ద అష్టమి తత్కాల నవమి ఆదివారం నుండి ద్వాదశి బుదవారం పర్యంతం అనగా ది.23.09.2023 స్థిరవారం నుండీ ది.26.09.2023 మంగళవారం వరకు పవిత్రోత్సవములు నిర్వహింపబడుచున్నవి. ఆలయంలో ఆ సంవత్సరములో జరిగిన అర్చనాది సర్వ కైంకర్యములలో దోషములు, భక్తుల ద్వారా సంక్రమించిన దోషములు, క్రిమికీటకాది సర్వజంతు ప్రవేశ దోష పరిహారార్దాము జరుపబడేవి పవిత్రోత్సవములు.పూజా కార్యక్రమములుది.23.09.2023 స్థిరవారము : సాయంత్రం గం.6.00 లకు విష్వక్సేన పూజ, పుణ్యాహవాచనము, మృత్సంగ్రహణ,అంకురార్పణ, దీక్షాధారణ యాగశాల ప్రవేశము, అగ్ని ప్రతిష్ట, ఆకల్మష హోమాలు,  ఏతత్ ప్రధాన హోమములు.24.09.2023 ఆదివారము : ఉదయం  గం.7.00 లకు విష్వక్సేన పూజ, పుణ్యాహవాచనము,  వాస్తు పూజ,  అగ్ని    ప్రతిష్ట, వాస్తు హొమము, సూత్ర గ్రహణం, ప్రోక్షణ, గ్రంధి బందనం, చతుర్వేదద్యయనం,   ద్వాదశసూక్తపారాయణ,  ఏతత్ ప్రధాన హోమములు.       సాయంత్రం గం.6.00 లకు విష్వక్సేన పూజ, పుణ్యాహవాచనము, కుంభ  పూజ,పవిత్ర  అధివాసం, దశసూక్త పారాయణం, సర్వరక్షర్దం ఊర్ద్వే చక్రపూజ, హౌత్రం,          ఏతత్  ప్రధాన హోమములు. ది.25.09.2023 సోమవారము: ఉదయం గంrfr.7.00 లకు విష్వక్సేన పూజ, పుణ్యాహవాచనము,  సప్తకలశ       స్నపన, పవిత్ర ఆరోపణ, శాంతి హోమములు. సాయంత్రం గం.6.00 లకు విష్వక్సేన పూజ, పుణ్యాహవాచనము, మహాశాంతిహోమం, చతుర్వేదద్యయనం, నీరాజన మంత్ర పుష్పాలు.ది.26.09.2023 మంగళవారము: ఉదయం  గం.7.00 ల నుండీ పవిత్ర విసర్జన, మహా పూర్ణాహుతి, దీక్ష విసర్జన, మహదాశీర్వచనము, పండిత సత్కారములు జరుపబడును.   ది.23.09.2023 తేదీ స్థిరవారం మద్యాహ్నం గం.1.00నుండీ ది.26.09.2023 మంగళవారం మద్యాహ్నం గం.1.00 వరకు గర్భాలయ దర్శనం నిలిపివేయబడును. తిరిగి మరలా ది. 26.09.2023 తేదీ మంగళవారం మద్యాహ్నం గం.3.00 లనుండి గర్భాలయ దర్శనం పునః ప్రారంభం.    కార్యనిర్వహణాధికారి.ఆకుల కొండలరావు ఒక ప్రకటనలో తెలిపారు.

About Author