పవిత్ర రంజాన్..మహిళలకు చీరలు పంపిణీ
1 min read
వైసీపీ యువ నాయకులు చరణ్ తేజ..
నందికొట్కూరు, న్యూస్ నేడు: రంజాన్ పండుగ సందర్భంగా సోమవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఆదేశాల మేరకు నందికొట్కూరు పట్టణంలోని మారుతీ నగర్ కాలనీలో ఉన్న 50 మంది ముస్లిం మరియు మైనారిటీ మహిళలకు చీరలను మారుతీ నగర్ వైసీపీ యువ నాయకులు చరణ్ తేజ సోమవారం పంపిణీ చేశారు.ఈ సందర్భంగా చరణ్ తేజ మాట్లాడుతూ ఎంతో పవిత్రమైన రంజాన్ పర్వదిన సందర్భంగా ముస్లిం సహోదర సహోదరీలు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ అల్లాహ్ ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని కోరుకుంటూ 50 మంది ముస్లిం మరియు మైనార్టీ మహిళలకు చీరల పంపిణీ చేయడం ఆ దేవుని కృపవలన జరిగిందని అన్నారు.ఈ కార్యక్రమంలో మారుతి నగర్ నాయకులు మధుసూదన్ రెడ్డి,పెయింటర్ మహబూబ్ బాష,బాబు, ప్రకాశం,రెహమాన్,శశాంక్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.