NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఇన్నాళ్లకు ఆ కోరిక తీరింది: అమిత్ షా

1 min read


పల్లెవెలుగు వెబ్: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును కేంద్ర హోం మంత్రి అమిత్ షా కొనియాడారు. అలంకరించిన పదవులన్నింటికీ వెంకయ్య వన్నె తెచ్చారని ప్రశంసించారు. నెల్లూరు జిల్లా వెంకటాచలంలో స్వర్ణ భారత్ ట్రస్ట్ 20వ వార్షికోత్సవ వేడుకల్లో హోంమంత్రి పాల్గొన్నారు. 370 ఆర్టికల్ రద్దులో వెంకయ్య పాత్ర మరువలేనిదన్నారు. రైతుల కోసం ఏదో ఒకటి చేయాలంటూ పరితపిస్తుంటారని అమిత్ షా చెప్పారు. వెంకయ్య గురించి ఆయన స్వస్థలంలో మాట్లాడాలన్న తన కోరిక ఇవాళ తీరిందన్నారు. అతి సామాన్య గిరిజనులకూ పద్మ పురస్కారాలు అందుతున్నాయని..కాళ్లకు చెప్పులు లేని వ్యక్తులు కూడా రాష్ట్రపతి భవన్‌కు వస్తున్నారని అమిత్ షా అన్నారు.

About Author