PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పెళ్లితో ఒక్క‌టైన స్వ‌లింగ సంప‌ర్కులు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : మ‌రో స్వలింగ సంప‌ర్కుల జంట ఒక్క‌టైంది. కోల్‌కతా, గుర్గావ్‌లకు చెందిన స్వలింగ సంపర్కులు జూలై 3న పెళ్లి చేసుకున్నారు. పెళ్లి ద్వారా తమ బంధాన్ని అధికారికంగా మార్చుకున్నారు. పూజారి వేద మంత్రాల సాక్షిగా అభిషేక్ రే, చైతన్య శర్మతో ఏడడుగులు వేశారు. పవిత్ర అగ్ని చుట్టూ తిరిగి జీవితాంతం ఒకరినొకరు తోడుంటామని ప్రమాణం చేశారు. కుటుంబం, బంధువుల మధ్య అంగరంగ వైభవంగా వీరి వివాహం జరిగింది. పూర్తి హిందూ సంప్రాదయం ప్రకారం బెంగాలీ, మార్వాడీ ఆచారాల ప్రకారం వివాహ తంతు నిర్వహించారు. అభిషేక్ ధోతీ, కుర్తా ధరించగా, చైతన్య షేర్వాణీ వేసుకున్నారు. ఆదివారం కోల్‌కతాలో విందు కూడా ఏర్పాటు చేశారు.

                                     

About Author