PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఘనంగా మహనీయుడు బాబు జగ్జీవన్ రామ్ జయంతి

1 min read

పల్లెవెలుగు వెబ్ గోనెగండ్ల: మండల కేంద్రమైన గోనెగండ్ల లోని స్థానిక భారతీయ స్టేట్ బ్యాంక్ దగ్గర డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 116 వ జయంతి ఉత్సవాలు కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు కరుణాకర్ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా మహనీయుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి గ్రామ పెద్ద వ్యవసాయ పరపతి సహకార సంఘం (సొసైటీ )స్థలదాత బ్రహ్మయ్య, ఆదిత్య నాటక కళామండలి అధ్యక్షులు కౌలుట్లయ్య, ఎంపీటీసీ తాయప్ప ల చేతుల మీదుగా పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం జయంతిని ఉద్దేశించి కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు కరుణాకర్, ఏపీయూడబ్ల్యూజేఎఫ్ తాలూకా ఉపాధ్యక్షులు ఖాజా లు మాట్లాడుతూ 1908 ఏప్రిల్ 5వ తారీఖున బీహార్ రాష్ట్రంలో చాంద్వా అనే గ్రామంలో తండ్రి సోబిరం తల్లి వాసంతి దేవి లకు ఎనిమిదవ సంతానంగా డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జన్మించారు.ఆయన బ్రాహ్మణ వీధిలో పాఠశాలలో హైస్కూల్లో విద్యను మొదలుపెట్టారు.అక్కడ నుంచి దళిత సామాజిక పోరాటాలు ఉద్యమాలు నిర్వహించి అనేక పోరాటాలు చేసిన వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ అని ఆన్నారు.1926లో బెనారస్ విశ్వ విద్యాలయంలో చేరి విద్యార్థి నాయకుడిగా ఎదిగాడు 1981 లో కలకత్తా విశ్వవిద్యాలయంలో నుండి బిఎస్సి డిగ్రీ పాసయ్యాడు.1937లో బిహారిలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జగ్జీవన్ రామ్ కు పార్లమెంటరి పదవినిఇచ్చారు.అదేవిధంగా 1938లో ఆల్ ఇండియా కాంగ్రెస్ కు డెలిగేటుగా ఎన్నికయ్యాడు.1940 నుండి 46 దాకా బీహార్ కాంగ్రెస్ కమిటీకి కార్యదర్శిగా పనిచేశాడు.అదేవిధంగా 1946లో కేంద్రంలో తాత్కాలిక మంత్రివర్గంలో చేరాడు. 1947లో స్వతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ నాయకత్వంలో కార్మిక శాఖలో పనిచేశాడు.బాబు జగ్జీవన్ రామ్.ఇలాఎన్నో గొప్పవిజయాలు సాధించి ఆర్థికంగా సామాజికంగా ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలిచిన ఏకైక వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు అడ్వకేట్ వెంకటేశ్వర్లు, కెవిపిఎస్ సంఘం సభ్యులు పాపన్న, బతుకన్న,మునిస్వామి,సిఐటియు నాయకులు బతకన్న, ఆటో యూనియన్ నాయకులు కృష్ణ,వీరేష్, రంగా,ఈరన్న గౌడ్,డప్పు కళాకారులు చిన దేవన్న, మునప్ప, నరసింహుడు,కాటికాపర్లు సల్వాదిరంగన్న,గోవిందు,శంకరన్న,తిమ్మప్ప,రంగన్న,మల్లికార్జున,మాజీ ఎంపిటిసి నరసింహుడు నాయకులు మదీనా,అక్బర్ తదితరులు పాల్గొన్నారు.

About Author