PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బనగానపల్లెలో హోరెత్తిన యువగళం పాదయాత్ర

1 min read

– అడుగడుగునా యువనేత అపూర్వస్వాగతం

– కార్యకర్తలు, అభిమానుల్లో ఉప్పొంగిన ఉత్సాహం

పల్లెవెలుగు వెబ్ బనగానపల్లి: యువనేత నారా లోకేష్ చేపట్టిన 104వరోజు పాదయాత్రకు బనగానపల్లి నియోజకవర్గం జనం పోటెత్తారు. బనగానపల్లి నియోజకవర్గం టంగుటూరులో యువనేత చూసేందుకు జనం పెద్దఎత్తున తరలిరావడంతో రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. అడుగడుగున జనం యువనేతకు బ్రహ్మరథం పట్టారు. మహిళలు హారతులతో నీరాజనాలు పట్టగా, యువతీయువకులు కేరింతలు కొడుతూ బాణసంచా మోతలతో హోరెత్తించారు. పాదయాత్రకు బయలుదేరేముందు రాయపాడు క్యాంప్ సైట్ తటస్థ ప్రముఖులతో సమావేశమై వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తెలుసుకున్నారు. లోకేష్ ని చూసేందుకు మహిళలు, యువత, వృద్ధులు భారీగా రోడ్లపైకి తరలివచ్చారు. దారిపొడవునా వివిధ ప్రజలకు తమ సమస్యలను యువనేతకు చెప్పుకున్నారు. విద్యుత్ కోతలతో ఇబ్బంది పడుతున్నామని, నిత్యావసర సరుకుల ధరలు, పెరిగిన విద్యుత్ బిల్లుల కారణంగా బ్రతకడం కష్టంగా మారిందని మహిళలు ఆవేదన వ్యక్తంచేశారు.  జగన్ పాలనలో పన్నుల భారాన్ని, అసమర్ధ ప్రభుత్వ విధానాల గురించి ప్రజలకు వివరించారు. మరో ఏడాదిలో రాబోయే చంద్రన్న ప్రభుత్వం మీ అందరి కష్టాలు తీరుస్తుందని భరోసా ఇచ్చి యువనేత ముందుకు సాగారు. పాదయాత్ర దారిలో రైతులు, వడ్డెర్లు, యాదవులు యువనేతను కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రాలు సమర్పించారు. 104వరోజు యువనేత లోకేష్ 11 కి.మీ. పాదయాత్ర చేశారు. ఇప్పటివరకు యువగళం పాదయాత్ర 1330.1 కి.మీ. పూర్తయింది. శనివారం బనగానపల్లె పట్టణంలో యువగళం పాదయాత్ర, బహిరంగసభ నిర్వహించనున్నారు.

యువనేత పాదయాత్రలో వ్యక్తమైన సమస్యలు:

బీమా మిత్రలకు తీరని అన్యాయం చేశారు

-ఎమ్. స్రవంతి, కొలిమిగుండ్ల గ్రామం

2007 నుండి మేము భీమా మిత్రగా చేస్తున్నా.2014కు ముందు వరకు కూడా  ఒక  క్లెయిమ్ కు రూ.150 ఇచ్చారు.  2014లో చంద్రబాబు వచ్చిన తర్వాత ఒక క్లయిమ్ కి రూ.700 ఇచ్చేవారు. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మమ్మల్ని తొలగించింది.  కర్నూలు జిల్లాలో నాతోపాటు మరో 114 మందిని కూడా తొలగించారు.  సీఎం నివాసం దగ్గరికి వెళ్లి అడిగితే నెత్తిన చేయి పెట్టి మిమ్మల్ని కొనసాగిస్తానని  జగన్ హామీ ఇచ్చారు.  కానీ మాట నిలబెట్టుకోలేదు.  భీమా మిత్రలో ఎక్కువగా వితంతువులు ఉన్నారు.  పొలం పనులకు కూడా వెళ్లలేని స్థితిలో ఉన్న వాళ్ల  పరిస్థితి అయితే పూట గడవడం కూడా కష్టంగా ఉంది.  కనీసం మాకు ప్రత్యామ్నాయం కూడా ఈ ప్రభుత్వం చూపించడం లేదు.(లోకేష్ ను టంగుటూరు గ్రామంలో కలిసి సమస్యను చెప్పింది)
 వైసీపీ నేతల వేధింపుల తట్టుకోలేక ఊరు వదిలెళ్లిపోయాం

-ఎస్.సుందరయ్య, దళితుడు, ఆలవకొండ

నాది నంద్యాల జిల్లా, సంజామల మండలం, ఆలవకొండ. 2019 ఎన్నికలకు మందు మా గ్రామంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా పలువురికి రుణాలు వచ్చాయి. అనర్హత కారణంగా కొందరికి రాలేదు. కానీ దాన్ని మనసులో పెట్టుకుని వైసీపీ అధికారంలోకి వచ్చాక పార్టీ పెద్దల ప్రోత్సాహంతో నాపై దాడికి పాల్పడ్డారు. నేను కేసు పెట్టినా తీసుకోకుండా, నాపైనే ఎదురు కేసు పెట్టారు. నాకు ఒక యేడాది అమ్మఒడి వచ్చింది..మా ప్రభుత్వంలో వచ్చిన అమ్మఒడి ఎందుకు తీసుకుంటున్నావు ర..అని అసభ్య పదజాలంతో దూషించారు. వారి వేధింపులు, బెదిరింపులు తట్టుకోలేక మా గ్రామం నుండి వెళ్లి ప్రస్తుతం బేతంచర్లలో 3 ఎకరాలు కౌలుకు తీసుకుని జీవనం సాగిస్తున్నా. ఈ ప్రభుత్వం వచ్చాక దళితులకు..దళితులకు మధ్య గొడవలు పెట్టి పబ్బం గడుపుకుంటున్నారు.

పెరిగిన ధరలతో ఇబ్బందులు

-కె. తిమ్మన్న, కోవెలకుంట్ల.

18 ఏళ్ల క్రితం పత్తికొండ నుండి కోవెలకుంట్ల కు వలస వచ్చా.  జీవనాధారం కోసం ప్రస్తుతం  చిరు వ్యాపారం చేసుకుంటున్నా. ఊరూరు ద్విచక్ర వాహనంపై తిరిగి అప్పడాలు,  రకరకాల స్నాక్స్ అమ్ముతుంటాను.  మా కుటుంబం మొత్తం దీనిపైనే ఆధారపడి జీవిస్తుంది.  నలుగురం కష్టపడుతుంటే నెలకి ప్రస్తుతం రూ.15,000 మిగులుతున్నాయి. పిండిపదార్థాలు, వంటనూనె భారీగా పెరిగాయి. పెట్రోల్ ధరలు కూడా బాగా పెరిగాయి. దీంతో స్నాక్స్ ధరల పెంచడంతో అమ్మకాలు తగ్గాయి.  నెలకు 4,000 ఇంటి వద్ద చెల్లించాలి. కుటుంబ పోషన కష్టంగా మారింది.  నాకు ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు.  పెద్దబ్బాయి అగ్రికల్చర్ బీఎస్సీ చదివాడు.  ఉద్యోగాలు లేక విత్తనాలకొట్టులో పనిచేస్తున్నాడు.  చిన్నబ్బాయి డిగ్రీ చదివి ఖాళీగా ఉన్నాడు.  నేను పనులు చేసుకోవాలన్నా. అందుబాటులో లేవు.  సామాన్యులు గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నారు.

వడగళ్లు నాకు కడగండ్లు మిగిల్చాయి!

-భువనగిరి. రామకృష్ణుడు, గుళ్లగుర్తి గ్రామం, మిర్చి రైతు.

ఈ కారులో నేను 2 ఎకరాల్లో మిర్చి పంట వేశాను. పంట చేతికొచ్చే సమయంలో వడగాళ్ల వాన వచ్చింది. పంట మొత్తం నేలరాలి దెబ్బ తిని పాడైపోయింది. 2ఎకరాలకు లక్ష పెట్టుబడి పెట్టాను. 20క్వింటాలు పంట రావాల్సింది కేవలం 6 క్వింటాల్లే వచ్చింది. 20 క్వింటాలు వస్తే నాకు రూ.2లక్షలు వచ్చేది. కేవలం రూ.90వేలే వచ్చింది. దీనివల్ల రూ.1.10లక్షలు నష్టం వచ్చింది. అధికారులు వచ్చి పంట బీమా వస్తుందని చెప్పారు. కానీ నేటికీ పట్టించుకున్నవారు లేరు.

About Author