PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

హారర్‌‌ కమ్‌ కామెడీ..

1 min read

సినిమా డెస్క్​ : హారర్ మూవీస్‌కి ట్రెండ్‌తో నిమిత్తం ఉండదు. ఇంటరెస్టింగ్‌ పాయింట్‌ ఉన్న సస్పెన్స్‌, హారర్ చిత్రాలకు ప్రేక్షకులు పట్టం కడుతూనే ఉన్నారు. ఈ క్రమంలో భాగంగా ‘దెయ్యంతో సహ జీవనం’ (డిఎస్‌జె) పేరుతో నట్టికుమార్‌‌ ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఆయన కుమార్తె నట్టి కరుణను హీరోయిన్‌గా స్వీయ దర్శకత్వంలో సినిమా నిర్మించడం విశేషం. నట్టి క్రాంతి నిర్మాత. ఆల్రెడీ రిలీజైన ఈ మూవీ టీజర్‌‌ ఆకట్టుకుంటోంది. తాజాగా చిత్రం చిత్రీకరణ పూర్తయ్యి, రిలీజ్‌కి సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి కెమెరా: కోటేశ్వర రావు, సంగీతం: ఎస్.ఏ.ఖుద్దూస్, ఎడిటింగ్: గౌతంరాజు, ఆర్ట్: కెవి.రమణ.

About Author