అట్టహాసంగా గుర్రం బండి పందాలు
1 min read-పోటీలను ప్రారంభించిన గౌరు వెంకటరెడ్డి
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: మిడుతూరు మండల కేంద్రంలో శ్రీశ్రీశ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన మహోత్సవాల సందర్భంగా గ్రామంలో జరిగిన గుర్రం బండి పందాలు అట్టహాసంగా జరిగాయి. సోమవారం ఉదయం 8 గంటలకు నంద్యాల జిల్లా టిడిపి అధ్యక్షులు గౌరు వెంకటరెడ్డి గుర్రం బండి పోటీలను ప్రారంభించారు.ముందుగా వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో గౌరు వెంకటరెడ్డి ప్రత్యేకంగా పూజలో నిర్వహించారు.ఆలయ నిర్వహకులు మరియు కాత రామచంద్రారెడ్డి టిడిపి మండల కన్వీనర్ కాత రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో గౌరు వెంకటరెడ్డి,మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ గుండం రమణారెడ్డి లను వారు శాలువాతో సన్మానించారు.ఈ గుర్రం బండి పందాలలో 13 గుర్రాలు పాల్గొన్నాయని పోటీలలో గెలుపొందిన మొదటి విజేతగా 25 తులాల వెండి,రెండవ విజేత 20 తులాల వెండి,3వ విజేత 15 తులాల వెండి,4వ విజేత 10 తులాల వెండి,5వ విజేత ఐదు తులాల వెండిని కాత రామచంద్రారెడ్డి,కాత రమేష్ రెడ్డి అందజేశారు.పందాలను తిలకించడానికి వచ్చిన వారందరికీ కాత బ్రదర్స్ వారి ఆధ్వర్యంలో భోజనాలను ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో బన్నూరు సర్వోత్తమ రెడ్డి,బన్నూరు రామకృష్ణారెడ్డి,సుభాన్,ఐటిడి పి మండల కన్వీనర్ ఇంతియాజ్,బండి ముర్తు జావలి తదితరులు పాల్గొన్నారు.