NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బీడు భూముల్లో ఉద్యాన పంటలు ప్రోత్సహించాలి

1 min read

రైతుల పెట్టుబడి తగ్గాలి….తలసరి ఆదాయం పెరగాలి

డ్రోన్ టెక్నాలజీ వినియోగం పెరగాలి

డ్రిప్ ద్వారానే రసాయనిక ఎరువులు వినియోగించాలి

జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా

నంద్యాల, న్యూస్​ నేడు: జిల్లాలో ఖరీఫ్ చివరలో 2 లక్షల ఎకరాల్లో మూడు నెలలు సెనగ పంట సాగుకు మాత్రమే పరిమితమై మిగిలిన కాలాన్ని వృధాగా ఉంచుతున్న బీడు భూముల్లో ఉద్యాన పంటలు  వేసుకునేలా రైతులను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి వెల్లడించారు. శుక్రవారం కలెక్టరేట్లోని సెంటినరీ హాలులో నాణ్యమైన ఉల్లి, మిర్చి, పసుపు పెంపకం కోసం హార్టికల్చర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి వర్క్ షాప్ కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. హార్టికల్చర్ అధికారి నాగరాజు, జిల్లా వ్యవసాయ అధికారి మురళీకృష్ణ, మార్క్ ఫెడ్ డిడి హరినాథ్ రెడ్డి, నాబార్డు డిడిఎం సుబ్బారెడ్డి, మహానంది హార్టికల్చర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు డా.ముత్యాలనాయుడు, కిషోర్ కుమార్, యాగంటిపల్లె కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త బాలరాజు, ఐటిసి సంస్ధ మేనేజర్ విష్ణువర్ధన్, డిజిటల్ గ్రీన్ సంస్ధ ప్రతినిధి వెంకట్ గౌడ్, ఎఫ్పిఓలు, హార్టికల్చర్ సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ జిల్లాలోని దొర్నిపాడు, ఉయ్యాలవాడ, కొలిమిగుండ్ల, కోవెలకుంట్ల మండలాల్లో ఖరీఫ్ చివరిలో మూడు నెలలు మాత్రమే 2 లక్షల ఎకరాల్లో సెనగ పంట వేసి తర్వాతి 9 నెలల సమయమంతా బీడు భూములుగా వదిలేస్తున్నారని సంబంధిత భూముల్లో ఉద్యాన పంటలు  వేసుకునేలా రైతులను ప్రోత్సహించాలన్నారు. సదరు మండలాల జీవన ప్రమాణాల కంటే ఇతర మండలాల తలసరి ఆదాయం ఎక్కువగా వుంటోందన్నారు. దీంతో రైతాంగంతో పాటు జిల్లా అభివృద్ధికి నష్టం వస్తుందని సంబంధిత భూముల్లో ఉద్యాన వాణిజ్య పంటలు వేసుకునేలా ప్రోత్సహించాలన్నారు. జిల్లాలో 43 శాతం అభివృద్ధి వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాల ద్వారానే రంగాల పైనే ఆధారపడి ఉందని కలెక్టర్ తెలిపారు. అలాగే సర్వీసు విభాగం నుండి 39 శాతం, పరిశ్రమల నుండి 18 శాతం అభివృద్ధికిదోహదపడుతున్నాయన్నారు. ప్రధానంగా ఉద్యాన శాఖ నుండి 7వేల కోట్లు,పశు సంవర్ధక శాఖ నుండి మరో 7 వేల కోట్లు, వ్యవసాయ శాఖ నుండి 3 వేల కోట్లు, చేపల పెంపకం ద్వారా వెయ్యి కోట్లు వెరసి మొత్తం 17 వేల కోట్లు జిల్లాకు గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ గా ఆదాయం వస్తుందని కలెక్టర్ తెలిపారు. రానున్న రోజుల్లో 17 వేల కోట్ల నుండి 22 వేల కోట్ల ఆదాయాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటూ రైతుల పెట్టుబడి తగ్గించి తలసరి ఆదాయం పెరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.ఉద్యానవన పంటల పరంగా మామిడి, మిరప, పండ్లు జిల్లా అభివృద్ధికి తోడ్పడుతున్నాయని… అదే విధంగా పూల మొక్కల పెంపకానికి సంబంధించి 5 వేల ఎకరాల్లో చామంతి, వెయ్యి ఎకరాల్లో మల్లె, ఐదు వందల ఎకరాల్లో గులాబీ పంట వేయడం జరుగుతుందన్నారు. జిల్లాలో ఎకరాకు 26 మెట్రిక్ టన్నుల అరటి దిగుబడి ఉంటే అదే బంచ్ ప్రొటెక్షన్ చేయడం ద్వారామహానంది ఆలయంలో దేవునికి వాడిన పూల ద్వారా అగరబత్తీలు తయారు చేయడం జరుగుతుందన్నారు. అదే విధంగా జిల్లాలో పండించిన పంటలకు వాల్యూ యాడ్ చేయడం, డ్రిప్ ఇరిగేషన్, పండ్ల తోటల పెంపకం విస్తృతంగా చేపడితే   జిల్లా ముందంజలో ఉండే అవకాశం ఉంటుందన్నారు.జిల్లాలో సుమారుగా 4.5 లక్షల పశు సంపద ఉందని తద్వారా పాడి పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సి ఉందని కలెక్టర్ తెలిపారు. భూములను ఖాళీగా ఉంచకుండా పశుగ్రాసాన్ని ఉత్పత్తి చేయాలన్నారు. మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు, రిజర్వాయర్లలో చేపల పెంపకాన్ని ముమ్మరంగా చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.అంతకుముందు వివిధ యూనివర్సిటీల శాస్త్రవేత్తల పంట పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చీడపీడల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై రైతులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. అనంతరం మహానంది బనానా ఫార్మర్ సొసైటీ, బొల్లవరం ఫార్మర్ కమిటీ సభ్యులైన హుస్సేన్, అనురాధను జిల్లా కలెక్టర్ శాలువాతో సత్కరించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *