హార్టికల్చర్ మామిడి పంటలను పరిశీలించిన డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్
1 min readపల్లెవెలుగు వెబ్ పత్తికొండ : పత్తికొండ మండలం కోతి రాళ్ల గ్రామపంచాయతీ పరిధిలోని కనక దిన్నె లో సాగు స్తున్న ఆర్టికల్చర్ మామిడి పంటలను వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. శనివారం మండల పరిషత్ భవన్లో జరిగిన హార్టికల్చర్ క్లస్టర్ స్థాయి సమావేశానికి హాజరయ్యారు.సమావేశం అనంతరం పత్తికొండ మండలం కోతిరాళ్ళ పంచాయితీ పరిధిలోని కనకదిన్నె లో జరుగుతున్న ఫీడర్ ఛానల్ పనిని మరియు హార్టికల్చర్ మామిడి పంటలను క్షేత్ర స్థాయిలో పరిశీలిచారు. ఈ సమావేశానికి క్లస్టర్ పరిధి లోని కోడుమూరు, దేవనకొండ, తుగ్గలి, మద్దికెర మరియు పత్తికొండ మండలాల టెక్నికల్ అసిస్టెంట్లు,EC లు మరియు APO లు పాల్గొని క్లస్టర్లో జరిగిన పనుల పురోగతిని వివరించారు. ఈ సందర్భంగా డ్రామా పీడీ మాట్లాడుతూ, పత్తికొండ క్లస్టర్ పూర్తిగా వెనుక బడిన ప్రాంతం కాబట్టి ప్రతిఒక్కరు ఈ ప్రాంత అభివృద్ధికి కష్టపడి పనిచేసి నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించాలని కోరారు. రాబోవు సీజన్ ను దృష్టిలో ఉంచుకొని ప్రతి మండలంలో కూలీలకు ఎక్కువ పనులు కల్పించేందుకు ముఖ్యంగా వ్యక్తిగత ఫార్మ్ పాండ్స్ పనులను రైతుల పొలాల్లో విరివిగా గుర్తించాలని తెలిపారు. అలాగే పండ్ల తోటల పెంపకం మీద ఎక్కువ శ్రద్ధ వహించి రైతులు ఆర్థికంగా ఎదిగేందుకు పాటుపడాలన్నారు.కార్యక్రమంలో APD పక్కిరప్ప , CLRC CD ప్రదీప్ నాయక్ పాల్గొన్నారు.