ఆస్పత్రుల ద్వారా రోగులకు మెరుగైన సేవలు అందించాలి
1 min read
గర్భవతులను వంద శాతం నమోదు చేసి మాతృ మరణాలు జరగకుండా వైద్య సేవలందించాలి
జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా
కర్నూలు, న్యూస్ నేడు : క్షేత్ర స్థాయిలో ఆస్పత్రుల ద్వారా రోగులకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా వైద్య అధికారులను ఆదేశించారు.మంగళవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో వైద్య, ఆరోగ్య అంశాలపై వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన జిల్లా అధికారులు, జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా మెడికల్ ఆఫీసర్ లతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలన్న లక్ష్యంతో పని చేస్తోందని తెలిపారు..వైద్య సేవలు అందుతున్న తీరుపై ప్రజాభిప్రాయాన్ని తెలుసుకుంటోందని, కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి అందిస్తున్న వైద్య సేవలపై ప్రజల నుంచి మంచి ఫీడ్ బ్యాక్ వచ్చిందని, అలాగే జిల్లాలో అన్ని ఆస్పత్రులలో మంచి వైద్య సేవలందించి ప్రజల నుండి మన్ననలు పొందాలని కలెక్టర్ వైద్యాధికారులకు సూచించారు.గర్భవతులను వంద శాతం పోర్టల్ లో నమోదు చేసి వారికి సరైన వైద్య సేవలందించి మాతృ మరణాలు జరగకుండా చూడాలని కలెక్టర్ ఆదేశించారు .. చిప్పగిరి మండలం లో 89 శాతం మాత్రమే గర్భవతులకు రిజిస్టర్ చేశారని, సమస్య ఏంటని కలెక్టర్ మెడికల్ ఆఫీసర్ ను ప్రశ్నించారు..కొన్ని సచివాలయాల్లో వెనుకబడి ఉన్నామని, వెంటనే చేయిస్తామని మెడికల్ ఆఫీసర్ వివరించారు.. గర్భవతుల నమోదులో వెనుకబడిన మండలాల మెడికల్ ఆఫీసర్ లతో మాట్లాడుతూ గర్భవతులను రిజిస్టర్ చేయడం ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత అని, ఈ అంశంపై అలసత్వం వహించకూడదని కలెక్టర్ ఆదేశించారు.. 85 శాతం లోపు పురోగతి చూపిన మండలాల అధికారులకు షోకాజ్ నోటీసు లు జారీ చేయాలని కలెక్టర్ డిఎంహెచ్ ఓ ను ఆదేశించారు.. వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన కార్యక్రమాల అమలుకు సంబంధించి ఎక్కడ తప్పులు జరుగుతున్నాయి, ఎక్కడ వెనుకబడి ఉన్నాము అని ప్రతిరోజు ఒక గంట పాటు సమీక్ష చేసుకోవాలని కలెక్టర్ డి ఎం హెచ్ వో ను ఆదేశించారు.ఎమ్ ఎల్ హెచ్ పి లు నీటి నమూనాలను వారానికి ఒకసారి పరీక్షించి, అందులో బ్యాక్టీరియా పాజిటివ్ ఉంటే, డిపీఓ కు పంపించి, క్లోరినేషన్ చేయించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డిఎంహెచ్వో ను ఆదేశించారు..అభా ఐడి కార్డుల జనరేషన్ కు కూడా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి లో అందిస్తున్న వైద్య సేవలపై కలెక్టర్ ఆస్పత్రి సూపరింటెండెంట్ తో ఆరా తీశారు.. అలాగే హాస్పిటల్ డెవలప్మెంట్ పై చర్చించేందుకు హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సమావేశాన్ని నిర్వహించాలని కలెక్టర్ ఆస్పత్రి సూపరింటెండెంట్ ను ఆదేశించారు.వైద్య సిబ్బంది నియామకాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని కర్నూలు మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ ను ఆదేశించారు.. నియామకాలను పారదర్శకతతో, నియమ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు.సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కళ్యాణి, డీఎంహెచ్వో శాంతి కళ, ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు,కర్నూలు మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ చిట్టి నరసమ్మ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ సింధు సుబ్రమణ్యం, అదనపు డిఎంహెచ్ఓ డా.భాస్కర్, డిసిహెచ్ఎస్ మాధవి, జిల్లా మలేరియా అధికారి నూకరాజు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
