NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

గోవింద నామస్మరణతో మార్మోగిన హోసూరు ..

1 min read

పల్లెవెలుగు వెబ్​, పత్తికొండ : కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరు గ్రామంలో తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ధార్మిక ప్రవచనాలు, భజనలు, గోపూజ, కుంకుమార్చన తదితర కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

శుక్రవారం గోపూజ కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి మాట్లాడుతూ సనాతన భారతీయ ధర్మంలో గోవుకు మాతృస్థానం ఇవ్వబడిందని దానికి కారణం గోవు ఆబాలగోపాలాన్ని తల్లిలా పోషించే గుణమున్నదని, అటువంటి గోసంపదను పోషించుటకే తిరుమల తిరుపతి దేవస్థానములు గుడికో గోమాత పథకాన్ని ప్రవేశపెట్టిందని , గోరక్షణ వ్యక్తి ధర్మమే కాదు , సమాజ ధర్మమని అన్నారు.

ఈ కార్యక్రమంలో ధర్మకర్త హనుమన్న, హార్మోనిష్టు యజ్ఞం రామాంజనేయులు,తబలిష్టు విజయకుమార్, శ్రీ వీరభద్రస్వామి భజన మండలి అధ్యక్షులు బోయ హనుమంతు, దేవర వన్నూరప్ప,బనగాని వన్నూరప్ప,చాకలి పరశురాముడు, తెలుగు పండితులు నేటూరు వెంకటేశ్వర్లు యాదవ్ , కావేరి గోపాల్, బైరపు పరశురాముడు మాజీ సర్పంచ్ బైరపు వీరభద్రుడు, పుల్లూరి కృష్ణ మూర్తి,బండమీద జయరాములు, పత్తికొండ రామాంజనేయులు,ఉలివేని శేఖర్, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శ్రీ వీరభద్రస్వామి సేవాసమితి ఆధ్వర్యంలో భక్తులందరికీ సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేశారు.

About Author