NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

హోట‌ల్ చిన్నది.. క‌రెంట్ బిల్లు 21 కోట్లు !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : అదొక చిన్న టిఫిన్ హోట‌ల్.. క‌రెంటు బిల్లెమో చాలా పెద్దది. అధికారుల నిర్లక్ష్యం కార‌ణంగా 21 కోట్ల క‌రెంట్ బిల్ వ‌చ్చింది. అది చూసిన య‌జమాని నివ్వెర‌పోయారు. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా చింత‌ల‌పూడిలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. కొత్త బ‌స్టాండ్ స‌మీపంలో సాయి నాగ‌మ‌ణి ఓ చిన్న హోట‌ల్ న‌డుపుతున్నారు. సెప్టంబ‌ర్ కు చెందిన క‌రెంట్ బిల్లు చూసి ఆమె షాక్ అయింది. 21,48,62,224 రూపాయ‌లు బిల్లులో ఉంది. విద్యుత్ శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా.. అధికారులు బిల్లును స‌రిజేశారు. సాంకేతిక లోపం కార‌ణంగానే బిల్లు అలా వ‌చ్చింద‌ని వివ‌ర‌ణ ఇచ్చారు. అయితే అధికారుల నిర్లక్ష్యమే కార‌ణ‌మ‌ని బాధితురాలు ఆరోపించారు. బిల్లు తీసే స‌మ‌యంలో నిర్లక్ష్యంగా వ్యవ‌హ‌రించార‌ని ఆమె తెలిపారు.

About Author