ఇంటి,కుళాయి పన్నులు వేగవంతం చేయాలి : ఈఓఆర్డి
1 min readపల్లెవెలుగు, వెబ్ మిడుతూరు: గ్రామంలో ఉన్న ప్రతి ఇంటి మరియు కుళాయి పన్నులు వేగవంతం చేయాలని మండల ఈఓఆర్డి ఫక్రుద్దీన్ అన్నారు.మండల పరిధిలోని కడుమూరు గ్రామ సచివాలయంలో ఆయన సిబ్బంది మరియు గ్రీన్ అంబాసిడర్లతో గ్రామ సర్పంచ్ ఎస్.జీవరత్నంతో కలసి ఈఓఆర్డి సమావేశం నిర్వహించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సిబ్బంది మరియు వాలంటీర్లు కలిసి గ్రామంలో ఉన్న ప్రతి ఇంటి దగ్గరికి వెళ్లి పన్నులు 2022-2023 కు సంబంధించిన పన్నులు త్వరగా పూర్తి చేయాలన్నారు.తర్వాత గ్రీన్ అంబాసిడర్లు ప్రతిరోజు గ్రామంలో తిరుగుతూ ఎక్కడెక్కడ అయితే చెత్త చెదారం ఉంటుందో వాటిని శుభ్రంగా ఉంచుతూ స్వచ్ఛ గ్రామంగా తీర్చి దిద్దే బాధ్యత మీదేనని గ్రీన్ అంబాసిడర్లతో అన్నారు.ప్రతిరోజు గ్రీన్ అంబాసిడర్లు యాప్ లో హాజరు వేయాలని ఈఓఆర్డి ఫక్రుద్దీన్ వారికి తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పంచాయితీ కార్యదర్శి శివకళ్యాణ్ సింగ్,అసిస్టెంట్ ఇంజనీరు రమేష్,వెల్ఫేర్ అసిస్టెంట్ రహిమాన్ మరియు గ్రీన్ అంబాసిడర్లు పాల్గొన్నారు.