గృహ నిర్బంధం అప్రజాస్వామికం : నాదెండ్ల మనోహర్
1 min readపల్లెవెలుగు వెబ్ : ఏపీలో నిరుద్యోగ యువతకు జనసేన బాసటగా నిలిస్తే గృహనిర్బంధం చేస్తారా అంటూ ఆ పార్టీ నాయకులు నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండున్నర లక్షల ఉద్యోగాలిస్తామని చెప్పి వైకాపా ప్రభుత్వం నయవంచన చేసిందన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువత కోసం ఆయా జిల్లాల్లో ఉపాధి అధికారులకు వినతి పత్రం ఇవ్వాలని జనసేన తలపెట్టిన కార్యక్రమాన్ని అడుగడుగానా అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగులకు అండగా నిలుస్తున్న జనసైనికులు, పార్టీ నాయకుల్ని గృహ నిర్బంధం చేస్తున్నారని, ఇది ప్రజాస్వామికమని నాదెండ్ల మనోహర్ చెప్పారు.