గ్యాస్ లీకై ఇంటికి నిప్పు…
1 min read
పాక్షికంగా దెబ్బతిన్న ఇల్లు.. కాలిపోయిన వస్తువులు
రూ. లక్ష వరకు ఆస్థి నష్టం
గజ్జహళ్లి గ్రామంలోని దడేసుగురు భాష ఇంటిలో గ్యాస్ లీకై మంటలు
చెలరేగుతున్న దృశ్యం
మంటలను ఆర్పుతున్న గ్రామస్తులు
హొళగుంద, న్యూస్ నేడు : మండల పరిధిలోని గజ్జహళ్లి గ్రామం మేయిన్ బజార్లోని బనవన్న గుడి సమీపంలో హోటల్ నడుపుకుంటున్న దడేనుగురు భాష ఇంట్లో గ్యాస్ లీకై ప్రమాదం జరిగిన సంఘటన శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. దడేనుగురు భాష, అతని భార్య తమ ఇంట్లోనే హోటల్ నడువుకుంటున్నారు. భాష ఉదయం ఇంట్లో గ్యాస్ స్టౌ పై బుందీలు తిక్కుతుండగ భార్య బయట ఉంది. ఉన్నట్టుండి గ్యాస్ లీకై పెద్దగ మంటలు వ్యాపించడంతో అతను భార్యతో ఇంటి బయటకు వచ్చేసాడు. దీంతో చాల సేపు మంటలు వ్యాపించి అక్కడున్న కుర్చీలు, టీవీ, వాకిళ్లు, వైరింగ్, గాకచస్ స్టా ఇతర విలువైన వస్తువులన్ని కాలిపోయాయి. ఇల్లంతా పొగ వ్యాపించి పాక్షికంగా దెబ్బతింది. సిలెండర్లో తక్కువ మోతాదు గ్యాస్ ఉండడంతో కొద్దిసేవు తర్వాత మంటల ప్రభావం తగ్గుతుడంగ స్థానికులు వెంటనే నీళ్లు వదిలి మంటలను ఆర్పీవేశారు. కాగా ఈ సంఘటనతో దాదాపు రూ. లక్ష మేర నష్టం జరిగినట్లు బాధితుడు దడేసుగురు భాష తెలిపాడు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరాడు.