మా గ్రామ పేదలకు ఇళ్ల స్థల పట్టాలు మంజూరు చేయాలి
1 min read
ఆర్. మండగిరి గ్రామపంచాయతీ ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డి ఆర్డీవోకు వినతి పత్రం అందజేత
పత్తికొండ, న్యూస్ నేడు: పత్తికొండ మండలం జూటూరు రెవెన్యూ గ్రామం, ఆర్ మండగిరి గ్రామపంచాయతీలో ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థల పట్టాలు మంజూరు చేయాలని కోరుతూ, సోమవారం గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామస్తులు ఆర్డిఓ భరత్ నాయక్ కు వినతిపత్రం అందజేశారు. తమ గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ .616/1 లో 1 ఎకరా 12 సెంట్లు ప్రభుత్వ భూమి కలదు. ఇందులో తమ గ్రామపంచాయతీ పరిధిలోని వారికి కాకుండా ఎక్కడెక్కడి వారికో పట్టాలు మంజూరు చేయాలని ఆలోచనను మానుకోవాలని గ్రామస్తులు సూచించారు. తమ గ్రామంలో అనేకమంది ఇల్లు లేని నిరుపేదలు ఉన్నారని తెలిపారు. కావున తమ గ్రామానికి చెందిన నిరుపేదలకు ఇళ్ల స్థల పట్టాలు మంజూరు చేయాలని ఆర్డీవో ను కోరారు. అలాగే ఇదే భూమిలో పాఠశాల భవనం కోసం స్థలం కేటాయించాలని వారు ఈ సందర్భంగా కోరారు. ఈ మేరకు స్పందించిన ఆర్డిఓ ఈ విషయంపై విచారించి పేదలకు ఇళ్ల స్థల పట్టాలు మంజూరుకై చర్యలు తీసుకుంటామని వారితో చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆరు మండగిరి గ్రామస్తులు పాల్గొన్నారు.