జగనన్న లే అవుట్ లలో పక్కా గృహాలు వేగవంతంగా నిర్మించుకోవాలి
1 min readపల్లెవెలుగు వెబ్ చెన్నూరు: కనపర్తి జగనన్న లే అవుట్ లలో చేపట్టబోయే ఇంటి నిర్మాణాల పనులు వేగవంతంగా జరిగేందుకు లబ్ధిదారులు సహకరించాలని ఎంపీడీవో గంగనపల్లి సురేష్ బాబు, ఏపీఎం గంగాధర్ లు అన్నారు, శనివారం వారు చెన్నూరు కొత్త గాంధీనగర్ లో ఎమ్మెల్యే పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి ఆదేశాల మేరకు లబ్ధిదారులతో కలసి సమావేశం ఏర్పాటుచేసి వారికి కనపర్తి జగనన్న కాలనీకి సంభందించిన ప్రభుత్వ గృహ నిర్మాణ పనువిషయమై వారికి పూర్తి అవగాహన కల్పించడం జరిగింది, అదేవిధంగా 35 వేల రూపాయలకు సంబంధించి డ్వాక్రా సంఘాల ద్వారా ఇప్పించడం జరుగుతుందని , ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని వారు లబ్ధిదారులకు తెలియజేశారు, అంతేకాకుండా కనపర్తి జగనన్న లేఅవుట్లలో శరవేగంగా గృహ నిర్మాణ పనులు జరుగుతున్నాయని, ఇప్పటికే అక్కడ గృహ నిర్మాణ శాఖ ఏఈ అలాగే అసిస్టెంట్ ఇంజనీర్లు, గృహ నిర్మాణ శాఖ సిబ్బంది, గ్రామ సచివాలయ సిబ్బంది కలసి ఎప్పటికప్పుడు లేఅవుట్లలో జరుగుతున్న పనులపై పర్యవేక్షిస్తూ ఉన్నారని వారు తెలియజేశారు, గృహ నిర్మాణ లబ్ధిదారునికి ఒక లక్ష 80 వేల రూపాయలే కాకుండా, డ్వాక్రా సంఘాల నుండి బ్యాంకుల ద్వారా మరో 35 వేల రూపాయలు కలిపి మొత్తం రెండు లక్షల 15వేల రూపాయలతో ఇంటి నిర్మాణం చేపట్టడం జరుగుతుందని వారు తెలిపారు, జగనన్న ఇంటి నిర్మాణాలలో రాష్ట్రవ్యాప్తంగా కూడా 6పిల్లర్స్ వేయడం జరుగుతుందని అలాంటిది, కనపర్తి లేఅవుట్లలో అక్కడి స్థాయి, కండిషన్ బట్టి 9 పిల్లర్స్ వేయడం జరుగుతుందని, అలాగే ప్లేన్త్ భూమిపైన మూడు వరుసలు ఇటుకలతో కట్టి, తరువాత గ్రేడ్ ల్యాబ్ కడ్డీలు కట్టి దానిపైన స్లాబ్ వేయడం జరుగుతుందన్నారు, తదుపరి దానిపైన తొమ్మిదిన్నర అడుగులు గోడలు కట్టడం దానిపైన స్లాబ్ వేయడం జరుగుతుందని తెలియజేశారు, ప్రభుత్వం తరఫున వచ్చే లక్ష 80 వేల రూపాయలు కాకుండా డ్వాక్రా సంఘాల నుండి వచ్చే 35 వేల రూపాయలతో పూర్తిస్థాయిలో ఇంటి నిర్మాణం చేపట్టి లబ్ధిదారునికి అప్పగించడం జరుగుతుందని వారు తెలియజేశారు, ఇప్పటివరకు మొత్తం 7 వందల 30 గృహ నిర్మాణాలకు గాను 5 వందల 50 గృహాలకు పనులు చేపట్టి ఆర్ ఎల్ వరకు వచ్చాయని మిగతా గృహాలు కూడా పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లకు అప్పగించడం జరిగిందన్నారు, పనులను వేగవంతంగా చేసి రెండు నెలల లో గృహ నిర్మాణాలు పూర్తయ్యే విధంగా చర్యలు చేపడతామని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు సీసీలు, కార్యదర్శి శివ కుమార్ రెడ్డి, యాని మేటర్ మల్లెం స్వర్ణలత, తదితరులు పాల్గొన్నారు.