పీఎంఏవై గృహాలను పరిశీలించిన హౌసింగ్ డిఈ
1 min readపల్లెవెలుగు, వెబ్ మిడుతూరు: మిడుతూరు మండల పరిధిలోని కడుమూరు,నాగలూటి గ్రామాలలో చేపడుతున్న ప్రధానమంత్రి ఆవాజ్ యోజన పథకం కింద గృహాలు నిర్మిస్తున్న లబ్ధిదారుల ఇంటికి వెళ్లి హౌసింగ్ డిఈ ప్రభాకర్ వారితో మాట్లాడారు.కడుమూరులో మొత్తం పీఎంఏవై కింద 64 గృహాలు మంజూరు అయ్యాయని వాటిలో 15 గృహాలు పనులను మొదలుపెట్టారని అవి వివిధ దశలలో ఉన్నాయని ఇండ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు.అదేవిధంగా నాగలూటిలో గ్రామంలో 7ఇండ్లు మంజూరు అయ్యాయని వీటిలో ఒక్క ఇల్లు మాత్రమే పనులు మొదలుపెట్టారన్నారు. ఈఇండ్లకు ఎప్పటికప్పుడు బిల్లులను మీఅకౌంట్లో జమ చేస్తామని డిఈ లబ్ధిదారులతో అన్నారు.ఈకార్యక్రమంలో అసిస్టెంట్ ఇంజనీర్లు రమేష్,బాలయ్య,వర్క్ ఇన్స్పెక్టర్ అంజద్ భాష మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు.