హౌసింగ్ ఈ.ఈ.గా బాధ్యతలు స్వీకరించిన పి. వెంకటదాసు
1 min read
కర్నూలు, పల్లెవెలుగు:కర్నూలు హౌసింగ్ నూతన ఈ.ఈ.గా వెంకటదాసు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. మదనపల్లె నుంచి వచ్చిన జనరల్ ట్రాన్సఫర్ కింద వచ్చిన ఈ.ఈ. పి. వెంకటదాసు శుక్రవారం ఉదయం కలెక్టరేట్ లోని హౌసింగ్ పి.డి. కార్యాలయంలో పి.డి ( ఎఫ్ఏసీ) అజయ్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇప్పటి వరకు హౌసింగ్ ఈఈ ( ఎఫ్ఏసి) గా అర్బన్ డి.ఈ. ప్రభాకర్ కొనసాగారు. ఒకన్నటిర ఏడాదిగా ఎఫ్ఏసీలతో కొనసాగిన ఈఈ పదవి… పి. వెంకటదాసు రాకతో భర్తీ అయిందని, ఇక నుంచైనా హౌసింగ్ పనులు శరవేగంగా ముందుకు వెళ్తాయని ప్రజలు ఆశిస్తున్నారు. హౌసింగ్ పి.డి. అజయ్ కుమార్ ను కలిసిన వారిలో అర్బన్ డి.ఈ.ప్రభాకర్ , అర్బన్ ఏఈ సత్య భాస్కర్, కర్నూలు రూరల్ ఏఈ. రామయ్య తదితరులు ఉన్నారు.
