PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘ఎలాగే నిన్నిడిచి.. ఎలాగే ఉండేది..నారప్ప మూవీ సాంగ్‌..

1 min read

సినిమా డెస్క్​: తమిళ మూవీ ‘అసురన్’కు తెలుగు రీమేక్ ‘నారప్ప’. వెంకటేష్ లీడ్ రోల్ లో నటిస్తున్నారు. ప్రియమణి హీరోయిన్. కార్తీక్ రత్నం, రాజీవ్ కనకాల ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో డి. సురేష్ బాబు, కలైపులి ఎస్.థాను నిర్మిస్తున్నారు. షూటింగ్ తో పాటు పోస్ట్‌ ప్రొడక్షన్ కూడా కంప్లీట్అయిన ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ మొదలుపెట్టారు మేకర్స్. ఈ చిత్రానికి సంగీతం అందించిన మణిశర్మ బర్త్ డే సందర్భంగా నిన్న ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు. నారప్ప ఫ్యామిలీ అంతా కలిసి తన కొడుకు కార్తీక్ రత్నం పెళ్లి చూపులకు వెళ్తున్నప్పుడు సాగే ఈ పాట ఆకట్టుకుంటోంది. ‘చిలిపి చూపుల చలాకీ చిన్నమ్మి.. చలాకీ చిన్నమ్మి.. ఎలాగే నిన్నిడిచి.. ఎలాగే ఉండేది’ అంటూ అనంత శ్రీరామ్ రాసిన ఈ మెలోడీ పాటను ఆదిత్య అయ్యంగార్, నూతన మోహన్ పాడారు. ఆహ్లాదంగా ఉండే పల్లెటూరి వాతావరణం కథాంశంతో పచ్చని పొలాలు మధ్య విజువల్స్ తో కూడిన ఈ పాట సినిమాకే హైలైట్ గా నిలిచేలా ఉంది. ఇటీవల సురేష్ ప్రొడక్షన్స్ ప్రారంభించిన ఎస్పీ మ్యూజిక్ లేబుల్‌లో ‘నారప్ప’సాంగ్స్ విడుదలవుతున్నాయి.

About Author