తీపి పదార్థాలు తింటే ఆరోగ్యానికి ఎంత నష్టమంటే !
1 min readపల్లెవెలుగు వెబ్ : తీపి పదార్థాలు ఒక్కసారి నోట్లో పడితే.. మళ్లీ మళ్లీ తినాలనే కోరిక పెరుగుతుంది. తియ్యని పదార్థాలు శరీరంలోకి చేరితే అవసరానికి మించిన క్యాలరీలు శరీరంలోకి చేరిపోతాయి. చక్కెర చర్మానికి సాగే గుణాన్ని, బిగువునూ అందించే కొల్లాజన్ నాణ్యతను దెబ్బతీస్తుంది. ఫలితంగా చర్మం మీద ముడతలు పెరుగుతాయి. మెరుపు తగ్గి, చర్మం జీవం కోల్పోతుంది. తీపి శరీరంలో ఇన్ఫ్లేమేషన్ ను పెంచుతుంది. ఫలితంగా కీళ్ల నొప్పులు, వాపు పెరుగుతాయి. అధిక చక్కెర త్వరగా జీర్ణం కాదు. పొట్టలో గ్యాస్ పెరిగి నొప్పికి దారితీస్తుంది. చక్కెర దంతాల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఫలితంగా దంతాలు పుచ్చు, ఊడిపోతాయి. తీపి శరీరంలో కొవ్వు పేరుకునే ప్రక్రియను అస్థవ్యస్థం చేస్తుంది.