యోగులు ముఖ్యమంత్రి కావడమేంటి ?
1 min readపల్లెవెలుగువెబ్ : ఉత్తరప్రదేశ్ కు చెందిన సాధువు స్వామి అవిముక్తేశ్వరానంద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. యోగులు ముఖ్యమంత్రి అవ్వడమేంటని ప్రశ్నించారు. సెక్యూలరిజం ప్రకారం పాలన చేస్తానని ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి ఒక మత విశ్వాసానికి ఎలా కట్టుబడి ఉంటారని అవిముక్తేశ్వరానంద ప్రశ్నించారు. అవిముక్తేశ్వరానంద మాట్లాడుతూ ‘‘రెండు వాగ్దానాలపై ఏ వ్యక్తి నిలబడలేడు. ఒక యోగి ఇప్పటికే మహంత్‌గా ఉండొచ్చు కానీ ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి అవ్వకూడదు. ఇలాంటివి ‘ఖలీఫత్’ సిద్ధాంతంలోనే అవుతాయి. ఒక ఇస్లామీ ప్రవర్త, పాలనాధికారి అయ్యేది ఖలీఫత్ ద్వారానే’’ అని అన్నారు.