ఇప్పుడు ఇలా అంటే ఎలా ?
1 min readపల్లెవెలుగువెబ్ : ఆర్థిక పరిస్థితి వల్ల ఫిట్ మెంట్ ఎక్కువ ఇవ్వలేకపోయామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. నిన్నే చెబితే ఉపాధ్యాయ సంఘాల సమస్యలు పరిష్కరించే వాళ్లమన్నారు. హెచ్ఆర్ఏ వల్ల టీచర్లకు అన్యాయం జరిగిందని చెబితే సరిచేశామని అన్నారు. మినిట్స్ తయారయ్యాక బయటకు వెళ్లి మాట్లాడటం సరికాదన్నారు. ప్రభుత్వ పరిస్థితిని ఉద్యోగులు సహృదయంతో అర్థం చేసుకోవాలని అన్నారు. ఎవరూ అడగకపోయినా ఉద్యోగ విరమణ వయస్సు 62కు పెంచినట్టు సజ్జల తెలిపారు. మిగిలిన సమస్యలు కూడ పరిష్కరిస్తామని సీఎం హామీ ఇచ్చినట్టు తెలిపారు.