వైఎస్ వివేకా గుండెపోటుతో చనిపోయారని ఎలా చెప్పారు ?
1 min readపల్లెవెలుగు వెబ్ : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి గుండెపోటుతో చనిపోయారని ఎలా చెప్పారంటూ పలువురిని సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. కడప ఎంపీ అవినాష్ రెడ్డి వ్యక్తిగత పీఏలు రమణారెడ్డి, రాఘవరెడ్డి, అప్పటి సాక్షి పత్రిక విలేకరి బాలకృష్ణారెడ్డిని సీబీఐ అధికారులు ప్రశ్నించారు. వివేక గుండెపోటుతో చనిపోయారని మొదట స్థానిక పోలీసులకు సమాచారం ఎలా అందించారని రాఘవరెడ్డిని ప్రశ్నించారు. ఎంపీ అవినాష్ రెడ్డి పీఏలను మధ్యాహ్నం 3:30 నిమిషాల నుంచి రాత్రి 7:30 నిమిషాల వరకు ప్రశ్నించారు. పులివెందుల అతిథి గృహంలో 12 మందిని సీబీఐ అధికారులు ప్రశ్నించారు.