అసోసియేషన్ తో కాకుండా.. వ్యక్తులతో ఎలా చర్చిస్తారు ?
1 min readపల్లెవెలుగువెబ్ : సినిమా రంగ సంక్షోభం పై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తో చర్చించాలని సీపీఐ నేత నారాయణ డిమాండ్ చేశారు. చట్టబద్ధంగా ఎన్నికైన అసోసియేషన్ తో కాకుండా.. వ్యక్తులతో ఎలా చర్చిస్తారని ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సినీ పరిశ్రమపై ఏపీ ప్రభుత్వం ద్వంద్వ వైఖరిని అవలంబిస్తోందని తప్పుబట్టారు. సినిమా వాళ్లను బూతులు తిడుతుంటే సీఎం జగన్ ఎందుకు ఖండించరని నిలదీశారు. సినీ పరిశ్రమ సమస్యలు పరిష్కారం కాకుండా.. చర్చలో మాత్రం ఉండాలనేది ప్రభుత్వం ఆలోచన అని నారాయణ తప్పుబట్టారు.