పుట్టగొడుగులు ఆరోగ్యానికి ఎంత మంచిదంటే !
1 min readపల్లెవెలుగు వెబ్ : పుట్టగొడుగులు ప్రకృతి సిద్ధంగా లభిస్తాయి. శాఖాహారులకు పుట్టగొడుగులు ఎంతో ప్రత్యేకం. ఇవి ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తాయి. వీటిలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇందులోని విటమిన్ సి గుండెకు చాలా మంచిది. పొటాషియం బ్లడ్ ప్రెషర్ ను బ్యాలెన్స్ చేస్తుంది. ఇది మెదుడుకి మంచిది. ఇందులో పుష్కలంగా డి విటమిన్ దొరకుతుంది. ఇది ఎముకల దృఢత్వానికి ఉపయోగపడుతుంది. ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ కణాలు దెబ్బతినుకుండా చూస్తాయి. విటమిన్ బి ఇందులో అధికంగా ఉండటం వల్ల ఎర్రరక్తకణాల అభివృద్ధికి తోడ్పడుతాయి. రకరకాలుగా వీటిని వండుతారు. మాంసాహారం టెక్చర్ ఉండే పుట్టగొడుగులు బలవర్థకమైన ఆహారమని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.