కరోన గాలిలో ఎంతసేపు ఉంటుందంటే ?
1 min readపల్లెవెలుగువెబ్ : కరోన వైరస్ మానవాళికి పెను సవాల్ విసిరింది. ప్రజారోగ్యానికి పెనుముప్పుగా మారింది. ఈ నేపథ్యంలో గాలిలో కరోన వైరస్ ఎంత సేపు మనుగడ సాగించగలదన్న పరిశోధనను ఇంగ్లండ్ లోని బ్రిస్టల్ విశ్వవిద్యాలయంలో ఏరోసోల్ రీసర్చ్ సెంటర్ పరిశోధకులు అధ్యయనాన్ని నిర్వహించారు. కరోన వైరస్ గాలిలో ఉంటే దాని సంక్రమణ సామర్థ్యం కేవలం 20 నిమిషాల్లో 90 శాతం మేర నశిస్తుందని తేల్చారు. అందులో తొలి ఐదు నిమిషాల్లో ఎక్కువ నష్టం సంభవిస్తుందని గుర్తించారు. ఆర్ధ్రత 40 శాతం కంటే తక్కువగా ఉన్న వాతావరణంలో వైరస్ లు తమ సంక్రమణ సామర్థ్యంలో దాదాపు 50 శాతాన్ని దాదాపు 5,10 సెకెన్ల వ్యవధిలో కోల్పోతాయని నిపుణులు నిర్ధారించారు.