PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

`ఆచార్య‌` సినిమాలో చ‌ర‌ణ్ ఎంత‌సేపు ఉంటారంటే ?

1 min read

పల్లెవెలుగు వెబ్ : మెగాస్టార్ చిరంజీవి హీరోగా న‌టిస్తున్న చిత్రం `ఆచార్య‌`. త్వర‌లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆచార్య సినిమాలో రామ్ చ‌ర‌ణ్ కూడ కీల‌క పాత్రలో న‌టిస్తున్నారు. అయితే.. చ‌ర‌ణ్ పాత్ర సినిమాలో ఎంతసేపు ఉంటుంద‌న్న దానిపై క్లారిటీ లేదు. ఈ విష‌యం పై  మెగా అభిమానులు సోష‌ల్ మీడియాలో తెగ చ‌ర్చిస్తున్నారు. విస్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం  ఇంట్రవెల్ బ్యాంగ్ పడేముందు చరణ్ పాత్ర ఎంట్రీ ఉంటుందని, సెకండాఫ్‌లో 40 నిమిషాలకు పైగానే ఉండబోతుందని తెలుస్తోంది. ఇందులో చిరు – చరణ్‌ల కాంబినేషన్ సీన్స్ గూస్‌బంస్ వచ్చేలా ఉంటాయని ఇప్పటికే చిత్ర దర్శకుడు కొరటాల శివ చెప్పుకొచ్చారు. ఆ విషయం ఇటీవల వచ్చిన సిద్ద పాత్రకు సంబంధించిన టీజర్‌లోనూ అర్థమైంది. కొణిదెల ప్రొడక్షన్స్ సమర్పణలో మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి ‘ఆచార్య’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

About Author