ఆ సీఎంకు ఎంత మంది తండ్రులని మేము అడిగామా ?
1 min readపల్లెవెలుగువెబ్ : అసోం ముఖ్యమంత్రి హిమంత విశ్వశర్మకు ఎంతమంది తండ్రులంటూ తాము ఏమైనా అడిగామా అని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. రాహుల్ గాంధీ ఏ తండ్రి కుమారుడంటూ తాము ఎప్పుడైనా అడిగామా అని హిమంత విశ్వశర్మ వ్యాఖ్యలపై జగ్గారెడ్డి ఈ మేరకు స్పందించారు. రాహుల్ గాంధీపై హిమంత మూర్ఖంగా చేసిన వ్యాఖ్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఒక సీఎం హోదాలో ఉన్న హిమంత.. రాహుల్ గాంధీ తండ్రి ఎవరో తెలియనంత మూర్ఖుడా అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. రాహుల్ గాంధీ కుటుంబం గురించి మాట్లాడే నైతిక అర్హత బీజేపీకి, ఆ పార్టీకి చెందిన అసోం సీఎంకూ లేదన్నారు. దేశం కోసం రాహుల్ గాంధీ కుటుంబం తన ఆస్తులనే త్యాగం చేసిందన్నారు. స్వాతంత్రోద్యమంలో 16 సంవత్సరాలు జైలు జీవితం గడిపిన చరిత్ర పండిట్ నెహ్రూదని పేర్కొన్నారు.