జీన్స్ ఫ్యాంట్ నెలకు ఎన్నిసార్లు ఉతకాలంటే !
1 min readపల్లెవెలుగు వెబ్: వాషింగ్ మిషన్ తరచూ వాడితే పర్యావరణం పై తీవ్ర ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమిని కాపాడాలంటే వాషింగ్ మిషన్ల వాడకం తగ్గించాలని సూచిస్తున్నారు. తాజాగా సొసైటీ కెమికల్ ఆఫ్ ఇండస్ట్రీ తన నివేదికలో పలు విషయాలు వెల్లడించింది. వాషింగ్ మిషన్లో బట్టలు ఉతికే ప్రతిసారి మిలియన్ల మైక్రో ఫైబర్లు నీటిలోకి విడుదల అయి.. సముద్రాల్లోకి ప్రవేశిస్తాయని, మహా సముద్రాల్లో కాలుష్యానికి ఇవి ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. మైక్రో ఫైబర్లు పాలిస్టర్, రేయాన్, నైలాన్ వంటి సింథటిక్ ఫైబర్ల నుంచి వెలువడతాయి. వీటిని నివారించాలంటే జీన్స్ ఫ్యాంట్ ను నెలకు ఒకసారి, జంపర్స్ ని పదిహేను రోజులకు ఒకసారి, పైజామాలను వారానికి ఒకసారి ఉతకాలని సూచిస్తున్నారు.