ఎన్నిసార్లు విన్నవించినా ప్రభుత్వంలో చలనం లేదు
1 min read-బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదు:ఏఐటీయూసీ
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: అంగన్ వాడి కార్యకర్తలకు మరియు సహాయకులకు వేతనాలు పెంచే వరకు సమ్మె ఆపేది లేదని భయపడే ప్రసక్తే లేదని ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి ఎం.రమేష్ బాబు అన్నారు.ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని అమలు చేయాలని కార్మికులు కోరుతున్నారని తక్షణమే కనీస వేతనం అమలు చేసి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గ్రాట్యూటీ చెల్లించాలని ఎన్ని నిర్భందాలు పెట్టినా సమ్మె కొనసాగుతుందని చర్చలు చేయకుండా బెదిరింపులకు పాల్పడితే కార్మికులు ఉద్యమాన్ని ఉధృతం చేస్తారని రమేష్ బాబు,వ్యకాస జిల్లా నాయకులు పక్కిర్ సాహెబ్ లు హెచ్చరించారు.గురువారం స్థానిక మిడుతూరులో కార్మికుల మూడో రోజున మోకాళ్ళ మీద ఉంటూ కార్మికులు నిరసన చేపట్టారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న లక్ష మంది అంగన్వాడీ కార్మికులు తమ న్యాయమైన వేతనాల పెంపుపై నాలుగున్నర సంవత్సరాలుగా శాంతి యుతంగా ఆందోళన చేస్తూ ప్రభుత్వానికి విన్నవించినా ప్రభుత్వంలో చలనం లేదన్నారు.ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నెరవేర్చాలని అన్నారు.సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గ్రాట్యూటీ ని అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.ఫేస్ యాఫ్ రద్దు చేయాలన్నారు.కార్మికులు అడిగే న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుండా సమ్మెను తప్పుదోవ పట్టించేందుకు అధికార యంత్రంగాం చూడడం తగదు అన్నారు.సమస్యలు పరిష్కరించే వరకు ఎన్ని బెదిరింపులకు పాల్పడినా సమ్మె కొనసాగుతుందని వారు అన్నారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల నాయకులు ఓబులేష్,వెంకట శివుడు,యూనియన్ నాయకులు పుణ్యావతి,కమలమ్మ, నాగేశ్వరమ్మ,సుబ్బమ్మ భాగ్యమ్మ తదితరులు పాల్గొన్నారు.