NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నియంత హిట్ల‌ర్ వాచ్ ఎంత ధ‌ర ప‌లికిందంటే ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : జర్మనీ నియంత అడాల్ఫ్‌ హిట్లర్‌కు సంబంధించిన చేతి గడియారం వేలం వేయగా దానిని దక్కించుకునేందుకు ఎగబడ్డారు. అమెరికాలోని అలెగ్జాండర్ హిస్టారికల్ వేలంలో ఈ గడియారం 1.1 మిలియన్‌ డాలర్లు(సుమారు రూ.8.6 కోట్లు) పలికింది. బంగారు ఆండ్రియాస్‌ హుబెర్‌ రివర్సిబుల్‌ వాచ్‌ నాజీ పార్టీ గుర్తును కలిగి ఉంటుంది. అలాగే.. గద్ద, స్వస్తిక్‌ గుర్తులు సహా ఏహెచ్‌ అని అడాల్ఫ్‌ హిట్లర్‌ పేరును సూచిస్తూ అక్షరాలు ఉంటాయి. నాజీ స్మారక వస్తువులను వేలం వేస్తున్నట్లు ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటోంది వేలం సంస్థ. తాజాగా..గడియారం వేలానికి ముందు జెవిష్‌ నేతలు తీవ్రంగా ఖండించారు. అయినప్పటికీ వేలం కొనసాగించింది. ఈ వాచ్‌ను ఓ గుర్తు తెలియని వ్యక్తి సొంతం చేసుకున్నట్లు పేర్కొంది.

                                              

About Author