నీరజ్ కోసం ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందంటే ?
1 min readపల్లెవెలుగు వెబ్: జావెలిన్ త్రో క్రీడలో నీరజ్ చోప్రా సరికొత్త అధ్యాయాన్ని సృష్టించాడు. వందేళ్ల భారత నిరీక్షణకు ముగింపు పలికాడు. 87.58 మీటర్ల దూరం విసిరి యావత్ క్రీడాభిమానుల్ని సంబరాల్లో ముంచేశాడు. నీరజ్ చోప్రా ఈ ఘనత సాధించడానికి భారత ప్రభుత్వం భారీగానే ఖర్చు చేసింది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకారం ఒలంపిక్స్ కు ముందు 450 రోజుల పాటు నీరజ్ చోప్రా విదేశాల్లో శిక్షణ తీసుకోవడానికి, పోటీల్లో పాల్గొనడానికి 4 కోట్ల 85 లక్షల 39 వేల 638 రూపాయలు ఖర్చు చేసింది. 2019లో నీరజ్ చోప్రా మోచేయి శస్త్ర చికిత్స తర్వాత అతని వ్యక్తిగత కోచ్ గా డాక్టర్ క్లాస్ బార్టోనియట్జ్ నియమితులయ్యారు. ఆయనకి 1,22,24,880 చెల్లించారు. నాలుగు జావెలిన్ల కొనుగోలు కోసం 4,35,000 ఖర్చు చేశారు. 2021లో యూరప్ టోర్నమెంట్ లో పాల్గొనడానికి 50 రోజుల పాటు స్వీడన్ లో ఉన్నాడు. ఇందు కోసం 19,22,533 రూపాయలు ఖర్చు చేసింది.