రహదారికి డివైడర్లు అడ్డం పెడితే ఎలా వెళ్లాలి
1 min read– హైవే అధికారులపై మండిపడ్డ స్థానికులు
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు: చెన్నూరు పాత రోడ్డుకు( గోసుల కళ్యాణమండపం, ఆంధ్ర స్పేస్) క్రాస్ రహదారిలో డివైడర్లు అడ్డం పెడితే ఎలా వెళ్లాలి అని స్థానిక ప్రజలు జాతీయ రహదారి అధికారులను ప్రశ్నించారు, ఆదివారం సాయంత్రం కడప -కర్నూల్ జాతీయ రహదారి గోసుల కళ్యాణమండపం క్రాస్ వద్ద నుండి చెన్నూరు పాత రోడ్డు వద్దకు వెళ్లే రహదారికి అడ్డంగా నేషనల్ హైవే అధికారులు భారీ కొక్లైన్ల ద్వారా డివైడర్లు రోడ్డును మూసి వేసేందుకు ప్రయత్నం చేయగా చెన్నూరు కు చెందిన మైనార్టీ నాయకులు, అలాగే గ్రామ ప్రజలు ఆ పనులను అడ్డుకోవడం జరిగింది, ఎన్నో సంవత్సరాల నుండి ఇదే రహదారిపై నుండి పాత రోడ్డు మీదికి వెళుతున్నామని, అయితే ఏవైనా ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని నేషనల్ హైవే అధికారులకు ఎన్నోసార్లు విన్నవించుకున్నప్పటికీ దానిపైన కొంచమైనా శ్రద్ధ తీసుకోకుండా, ఇప్పుడు హడావిడిగా రోడ్డును మూసివేస్తామని రావడం విడ్డూరంగా ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు, ఇదే రహదారిపై అనేకసార్లు ప్రమాదాలు చోటు చేసుకున్నప్పటికీ స్పందించని అధికారులు ఇప్పుడు రోడ్డు మూసి వేయడంలో అర్థం ఏమిటని వారు ప్రశ్నించారు, చేసేది ఏమీ లేక నేషనల్ హైవే అధికారులు వెనుతిరి గారు, అయితే అప్పటికే వాహనాలతో ట్రాఫిక్ ఎక్కువ కావడంతో స్థానిక పోలీసులు స్పందించి వెంటనే అక్కడ ఉన్న ప్రజలకు నచ్చచెప్పి ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూడడం జరిగింది.