NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఈ ఉద్యోగుల‌కు భారీగా డిమాండ్ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : రెగ్యులర్‌ రోల్స్‌ కాకుండా ఒప్పందం మేరకు చేసేవారికి మే నెలలో డిమాండ్‌ 22 శాతం పెరిగింది. వీరిని గిగ్ వ‌ర్క‌ర్లు అంటారు. ప్రధానంగా విక్రయాలు, మార్కెటింగ్‌ విభాగంలో ఉద్యోగాలకు డిమాండ్‌ నెలకొంది. క్వెస్‌ కార్ప్‌కు చెందిన స్టార్టప్‌ టాస్క్‌మో తన తొలి ‘టాస్క్‌మో గిగ్‌ ఇండెక్స్‌’ నివేదికను విడుదల చేసింది. కరోనా మహమ్మారి తర్వాత భారతీయ కంపెనీలు గిగ్‌ వర్కర్ల కోసం, ప్రాజెక్టు ఆధారిత తాత్కాలిక ఉద్యోగుల కోసం ఎక్కువగా చూస్తున్నట్టు ఈ నివేదిక తెలిపింది. కంపెనీలు అన్ని విష‌యాల్లో గిగ్‌ వర్కర్లపైనే ఎక్కువగా ఆధార పడుతున్నాయని నివేదిక పేర్కొంది. మార్కెటింగ్, సేల్స్‌ విభాగాల్లో వీరికి డిమాండ్‌ మూడొంతులు పెరిగింది. 2022 జనవరి-మే నెల మధ్య ధోరణలను ఈ నివేదికలో టాస్క్‌మో వివరంగా ప్రస్తావించింది. తన ప్లాట్‌ఫామ్‌లో మే నెలలో 60వేల మంది గిగ్‌ వర్కర్లు పేర్లను నమోదు చేసుకున్నట్టు టాస్క్‌మో తెలిపింది.

                                          

About Author